News December 1, 2025

కరీంనగర్: ‘గుర్తుల గుర్తుంచుకో రామక్క’

image

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచ్‌కు గులాబీ, వార్డు సభ్యులకు తెలుపు రంగుల బ్యాలెట్ పేపర్లు కేటాయిస్తారు. కాగా వీరి ఎన్నికలో ఇవే కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర, కప్, ఛైర్, కొబ్బరికాయ సైన్స్ బానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు తారుమారయ్యే ప్రమాదముంది.

Similar News

News March 16, 2026

100కు ఫోన్ రాగానే ఘటనా స్థలానికి చేరుకోవాలి

image

బెట్టింగులు, నిషేధిత గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని భద్రాద్రి జిల్లా పోలీసులకు ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో జరిగిన నేర సమీక్షలో మాట్లాడుతూ.. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలు నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. 100కు ఫోన్ రాగానే ఘటనా స్థలానికి చేరుకోవాలని బాధితులకు అండగా నిలవాలన్నారు.

News March 16, 2026

సిద్దిపేట: ఈ నెల 22న సీఎం పర్యటనపై మంత్రుల సమీక్ష

image

సిద్దిపేట జిల్లా నర్మేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఈనెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సభకు వచ్చే రైతులకు తాగునీరు, రవాణా సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లపై అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.

News March 16, 2026

ఖమ్మం: ఏడాది దాటినా అందని యాసంగి బోనస్

image

గత ఏడాది (2024-25) యాసంగి సీజన్లో సన్నరకం ధాన్యం విక్రయించిన రైతాంగానికి బోనస్ సొమ్ము అందకపోవడంతో ఆవేదన వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాలో 18,833 మంది రైతులకు రావాల్సిన రూ.63.63 కోట్ల బోనస్ ఏడాది దాటినా పెండింగ్‌లోనే ఉంది. వానాకాలం సీజన్‌కు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం, గత యాసంగి బకాయిలను వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.