News April 18, 2024

లోక్‌సభ ఎలక్షన్స్.. భువనగిరి బీ ఫామ్ అందజేత

image

ధర్మ సమాజ్ పార్టీ నుంచి భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా కొంగరి లింగస్వామి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆయనకు పార్లమెంటు టికెట్ కేటాయిస్తూ బీ ఫామ్ అందించారు. లింగస్వామి స్వగ్రామం సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం. టికెట్ కేటాయించడంతో పలువురు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

Similar News

News January 14, 2026

NLG: లండన్ వేదికగా చేనేత కళా వైభవం

image

చండూరుకు చెందిన చేనేత కళాకారుడు చిలుకూరి శ్రీనివాస్ అంతర్జాతీయ వేదికపై భారతీయ చేనేత నైపుణ్యాన్ని చాటనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు లండన్‌లో జరిగే ‘స్ప్రింగ్ ఫెయిర్’ వర్తక ప్రదర్శనలో చేనేత లైవ్ డెమో ఇచ్చేందుకు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 29న ఆయన లండన్ బయలుదేరనున్నారు. తన ఎంపికకు సహకరించిన కేంద్ర చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్‌కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

News January 14, 2026

నల్గొండ: 23, 24 తేదీల్లో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

image

జిల్లాకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 23, 24 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ సెక్రటరీ ఎన్. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జర్నలిస్టులు 20 తేదిలోగా నల్గొండ పౌర సంబంధాల అధికారిని సంప్రదించాలన్నారు.

News January 13, 2026

నల్గొండ: పాఠశాల నిర్మాణ పనుల తనిఖీ

image

వచ్చే విద్యా సంవత్సరం నాటికి నల్గొండ ఎస్ఎల్ బీసీ వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల అకడమిక్ బ్లాక్, తరగతి గదుల నిర్మాణ పనులను పూర్తి చేసి అప్పగించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఎస్ఎల్‌బీసీ వద్ద ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తనిఖీ చేశారు.