News December 1, 2025
దండేపల్లి: ఎన్నికలను బహిష్కరించిన మూడు గ్రామాలు

దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్, వంజరిగూడ, గూడెం గ్రామాలకు చెందిన ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించారు. ఈ మూడు గ్రామాల నుంచి సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని మండల అధికారులు తెలిపారు. నెల్కి వెంకటాపూర్‌ను జనరల్‌గా మార్చాలని, వంజరిగూడను వెంకటాపూర్‌లో కలపాలని, గూడెంలో ఎస్టీలు లేకున్నా రిజర్వ్ చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News December 3, 2025
ఏపీలో ఫిలిం టూరిజానికి మాస్టర్ ప్లాన్: మంత్రి దుర్గేష్

ఆంధ్రప్రదేశ్‌లో ఫిల్మ్ టూరిజానికి ప్రోత్సాహం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ప్రకటించారు. ఏపీని దేశంలోనే సినిమా షూటింగ్‌లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. విశాఖ బీచ్‌లు, గోదావరి నదీ తీరాలు, అరకు, లంబసింగి, తిరుపతి, శ్రీశైలం వంటి ప్రదేశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
News December 3, 2025
నవ దంపతులతో సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందరూ కోరుకుంటారు. అలా వర్ధిల్లాలనే వారితో సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం ఆచరిస్తే వారి జీవితంలో సకల సంపదలు, సౌభాగ్యాలు, సత్సంతానం కలుగుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పాడని నమ్ముతారు. సత్యనారాయణ స్వామి త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం కాబట్టి, ఆయన ఆశీస్సులు ముందుగా పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
News December 3, 2025
ఊట వేసిన మడి, వాత వేసిన పశువు

‘ఊట వేసిన మడి’ అంటే నీటి లభ్యత పుష్కలంగా ఉన్న పొలం (మడి). ఇది ఎప్పుడూ పచ్చగా, సమృద్ధిగా ఉంటుందని, దిగుబడి బాగా వస్తుందని అర్థం. అలాగే పూర్వకాలంలో పశువులకు (ముఖ్యంగా ఆవులు, ఎద్దులు) వ్యాధులు వచ్చినప్పుడు లేదా గాయాలు తగిలినప్పుడు ‘వాత’ వేసి చికిత్స అందించి నయం చేసేవారు. ఇలా ఊట వేసిన మడి, వాత వేసిన పశువు వల్ల రైతుకు మేలే జరుగుతుందని ఈ సామెత చెబుతుంది.


