News December 1, 2025

నారాయణపేటలో అమానవీయం!

image

NRPT జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ధన్వాడకు చెందిన భారతి.. <<18430084>>పురిట్లోనే చనిపోయిందని చెప్పి 6 రోజుల ఆడ శిశువును అప్పక్‌పల్లి శివారులోని ముళ్లపొదల్లో పడేసింది<<>>. అపస్మారకస్థితిలో కనిపించిన ఆ పసికందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. భారతి భర్త నర్సింహులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ప్రేమించి పెళ్లిచేసుకున్న దంపతులకు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు.

Similar News

News March 14, 2026

తుళ్లూరు: CMరాక ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 16న తుళ్లూరులో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఈ కార్యక్రమంలో భాగంగా తుళ్లూరులో ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. తుళ్లూరులో ఆర్యవైశ్య ట్రస్టుకు ప్రభుత్వం కేటాయించిన 6.80 ఎకరాల స్థలంలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

News March 14, 2026

ఇంకొల్లు: తాను చనిపోయి మరో ఇద్దరికి వెలుగులు

image

ఇంకొల్లుకు చెందిన కోట పద్మ (55 ) అనారోగ్యంతో చనిపోయింది. చనిపోయిన ఆమె కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. పెద్దకాకానికి చెందిన శంకర్ నేత్ర వైద్యశాల వైద్యులు వచ్చి శనివారం కంటి కార్నియాలు సేకరించారు. నేత్రదానానికి అంగీకరించిన కుమారుడు శ్రీహర్ష, చంద్రకళ, లక్ష్మీలను ఇంకొల్లు రోటరీ అవయవ దాన కమిటీ, వైద్యులు అభినందించారు.

News March 14, 2026

సూర్య కొత్త సినిమాపై అప్డేట్

image

సూర్య-వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ టీజర్‌ను ఈ నెల 16న సా.4.06 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యకు జోడీగా మమిత బైజు నటిస్తుండగా రాధిక, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. GV ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్నారు.