News December 1, 2025
KNR: ‘సారీ సర్.. మేం ఒప్పుకోం.. నిలుస్తాం, గెలుస్తాం’

మొదటి విడత గ్రామపంచాయతీ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక బరిలో నిలిచే అభ్యర్థి ఎవరనేది తేలాల్సి ఉంది. ఆయా పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులు 5- 10 వరకు నామినేషన్లు వేశారు. ఈ క్రమంలో నామినేషన్ ఉపసంహరణకు నేతలు ప్రయత్నిస్తుంటే ‘సారీ మేము ఒప్పుకోం.. బరిలో నిలుస్తాం, గెలుస్తాం’ అని పోటీదారులు చెబుతుండడంతో నేతలు అవాక్కవుతున్నారు. ఉపసంహరణకు ఎల్లుండి లాస్ట్ డేట్ కావడంతో బుజ్జగింపుల ప్రక్రియను ముమ్మరం చేశారు.
Similar News
News March 28, 2026
‘అమరావతి’పై నేడు ప్రత్యేకంగా అసెంబ్లీ.. వైసీపీ హాజరుపై సందిగ్ధత

AP: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఈ మేరకు విభజన చట్టంలో సవరణ చేయాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. CM చంద్రబాబు, Dy.CM పవన్‌తోపాటు దాదాపు 20 మంది MLAలు ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి వైసీపీ MLAల హాజరుపై ఇప్పటికీ స్పష్టత లేదు. చట్టబద్ధతపై మండలిలోనూ చర్చించాలని ఆ పార్టీ నేత సజ్జల ఇటీవల డిమాండ్ చేశారు.
News March 28, 2026
పొలాసలో 4.8.. రాయికల్ 0.5 మిల్లీమీటర్ల వర్షం

జగిత్యాల జిల్లాలో శుక్రవారం, శనివారం ఉదయం ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. పలుచోట్ల తేలికపాటి వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. పొలాసలో 4.8 మిల్లీమీటర్లు, రాయికల్ 0.5, ఎండపల్లిలో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తదితర ప్రాంతాల్లో అత్యంత తేలికపాటి జల్లులు కురిశాయి. కాగా పంటలు చేతికి వచ్చే సమయంలో ఈ అకాల వర్షాలతో తీవ్ర నష్టం అవకాశం ఉండటంతో మామిడి, వరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News March 28, 2026
విజయనగరం, మన్యం జిల్లాలకు వడగాల్పుల అలర్ట్

ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో శనివారం తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని AP విపత్తు నిర్వహణ సంస్థ MD కన్నబాబు ప్రఖర్ తెలిపారు. విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరకముడిదాం, రాజాం, రేగిడి ఆముదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు, మన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, పాలకొండ, సాలూరు, సీతానగరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.


