News December 1, 2025

WGL: గుర్తుల పంచాయితీ!

image

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచ్‌కు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉంది.

Similar News

News March 29, 2026

పాలమూరు: లోక్ అదాలత్..UPDATE!!

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా వివిధ కోర్టుల పరిధిలో ఉన్న మొత్తం 3,416 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు. ఐపీసీ (IPC) కేసులు-524, డీడీ (DD) కేసులు – 794, ఈపెట్టీ (e-Petty) కేసులు – 1,979 సైబర్ క్రైమ్ కేసులు-119 ఈ కేసుల పరిష్కారంతో బాధితులకు తక్షణ న్యాయం అందించడంతో పాటు, కోర్టులపై ఉన్న భారం కూడా తగ్గినట్లు ఎస్పీ వెల్లడించారు.

News March 29, 2026

NZB: ఆరుగురికి వారం రోజుల చొప్పున జైలు

image

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఆరుగురికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు. నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 35 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.3.50 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

News March 29, 2026

చేగుంట: విధుల్లో ఉన్న పోలీసులపై దాడి.. ముగ్గురు అరెస్ట్

image

విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చేగుంట ఎస్సై చైతన్య రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద కారులో రాంగ్ రూట్‌లో వచ్చి వాహనాన్ని అడ్డంగా నిలిపారు. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగి, వారిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విజయ్, పవన్, బాలాజీలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.