News December 1, 2025
MNCL: నూతన మద్యం పాలసీ అమలు.. అమ్మకాల జోరుకు సిద్ధం

మంచిర్యాల జిల్లాలో 73 వైన్ షాపులకు సోమవారం నుంచి 2025-27 సంవత్సరానికి సంబంధించిన నూతన మద్యం పాలసీ అమలు కానుంది. కొత్త షాపులు రాబోయే 3 నెలల పాటు భారీ అమ్మకాలతో కళకళలాడతాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. డిసెంబర్ 17 వరకు ఎన్నికల కోలాహలం, జనవరి తొలి వారం సెలబ్రేషన్స్‌తో పాటు జనవరి చివరిలో సమ్మక్క సారలమ్మ జాతర అమ్మకాలు అబ్కారీ శాఖకు భారీ ఆదాయాన్ని సమకూర్చనున్నాయి.
Similar News
News March 21, 2026
గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు: మంత్రి నాదెండ్ల

రాష్ట్రంలో గ్యాస్ కొరత అపోహలపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు 2.96 లక్షల బుకింగ్స్ రాగా 2.78 లక్షల డెలివరీలు పూర్తి చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా రూమర్స్ వల్లే అధిక బుకింగ్స్ జరుగుతున్నాయని, 26న విశాఖకు LPG నౌక చేరుకుంటుందని సరఫరా మరింత మెరుగవుతుందన్నారు. గ్యాస్ దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News March 21, 2026
మార్కాపురం కలెక్టర్‌గా విజయ సునీత

మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్‌గా ఎం.విజయ సునీత నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి మహిళా కలెక్టర్‌గా ఆమె ఈ ఘనత సాధించనున్నారు.
News March 21, 2026
పోలవరం జిల్లా మొదటి కలెక్టర్ ఈయనే..!

పోలవరం జిల్లా నూతన కలెక్టర్‌గా దినేశ్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయుష్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన, ఇకపై పోలవరం జిల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి అల్లూరి జిల్లా కలెక్టర్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తుండగా, ఇప్పుడు దినేశ్ కుమార్ మొదటి పూర్తిస్థాయి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.


