News December 1, 2025

ఖమ్మం: గుర్తుల పంచాయితీ!

image

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచ్‌కు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉంది.

Similar News

News March 14, 2026

తిరుపతి: ఆందోళనలో మామిడి రైతులు

image

సాధారణంగా మార్చ్ నెలలో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ ఏడాది వడగండ్లతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఈ నెల 17 నుంచి 20 వరకు వర్ష సూచన ఉంది. మామిడి పూత పుష్కలంగా ఉండే ఈ సమయంలో వర్షాలు పడితే మామిడి రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో రైతులు ఆందోళనలో పడ్డారు.

News March 14, 2026

రఘు భాయ్.. ది రియల్ హీరో

image

టీమ్ఇండియా టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత నెట్టింట ఒకరి పేరు మారుమోగుతోంది. ఆయనే రాఘవేంద్ర (రఘు భాయ్). ఒకప్పుడు కేవలం ₹21తో ఇంటి నుంచి బయటకొచ్చి క్రికెట్ కోసం పోరాడిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. నెట్స్‌లో గంటకు 150 కి.మీ వేగంతో బంతులు విసిరి, మన బ్యాటర్లను ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకం. అందుకే విరాట్ కోహ్లీ వంటి స్టార్లే ఆయనను టీమ్‌ఇండియాకు నిజమైన హీరోగా అభివర్ణిస్తున్నారు.

News March 14, 2026

నల్గొండలో 40 డిగ్రీలు దాటిన ఎండలు

image

నల్గొండ జిల్లాలో వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. మార్చి రెండో వారంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.4 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడిచిన రెండు రోజులుగా ఎండ తీవ్రత గణనీయంగా పెరిగింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.