News December 1, 2025
నల్గొండ: 3న గుర్తుల కేటాయింపు.. 11న పోలింగ్!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి నామినేషన్లకు సంబంధించి సోమవారం అప్పీల్‌కు అవకాశం ఉంది. 2వ తేదీన వచ్చిన ఫిర్యాదుల పరిష్కరిస్తారు. 3న మ.3గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. ఈలోపు మరిన్ని గ్రామాల్లో ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 9వతేదీ సాయంత్రం వరకు ప్రచారానికి అవకాశం ఉంది. 11వ తేదీ ఉదయం పోలింగ్ ప్రారంభమై 1 గంటకు ముగియనుంది.
Similar News
News March 14, 2026
‘సంభల్’లో నమాజ్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

<<15204583>>వివాదాస్పద సంభల్<<>>లోని మసీదులో నమాజ్ చేసే వ్యక్తుల సంఖ్యను పరిమితం చేయాలన్న UP అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. శాంతిభద్రతలను పరిరక్షించలేకపోతే SP, కలెక్టర్ బదిలీ చేయించుకోవాలని, లేదంటే రిజైన్ చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రతి కమ్యూనిటీకి కేటాయించిన స్థలంలో శాంతియుతంగా ప్రార్థనలు చేసుకునేలా చేయడం ప్రభుత్వ విధి అని తెలిపింది.
News March 14, 2026
రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం లేకుండా ప్రభుత్వం అప్రమత్తం: హోంమంత్రి అనిత

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామిని హోంమంత్రి అనిత శనివారం దర్శించుకున్నారు. రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం లేకుండా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు RTGS ద్వారా పరిస్థితులను సమీక్షిస్తున్నారని చెప్పారు. RTGS రాష్ట్రానికి గుండె లాంటిదని మంత్రి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులను నమ్మవద్దని సూచించారు.
News March 14, 2026
10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్: కలెక్టర్

కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద కఠినంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రంలోనూ తాగునీరు, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.


