News December 1, 2025
VKB: గుర్తుల పంచాయితీ!

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచికు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కీలకం కానున్నాయి. సర్పంచి గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉంది.
Similar News
News December 4, 2025
బెల్లంపల్లి: సర్పంచ్ అభ్యర్థి మౌనికపై దాడి యత్నం

బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి మౌనికపై దాడికి యత్నం జరిగినట్లు తాళ్లగురజాల ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఎస్టీ మహిళలకు రిజర్వైన ఈ స్థానంలో మౌనిక నామినేషన్ వేయగా, ఆమె తరఫున భాగ్య వార్డు సభ్యురాలిగా నామినేషన్ వేసింది. భాగ్య భర్త కృష్ణకు ఇది ఇష్టం లేక గొడవ పడ్డాడు. తమ మధ్య గొడవకు మౌనికనే కారణమని భావించి, మౌనిక, ఆమె భర్త సురేశ్‌పై దాడికి యత్నించాడు.
News December 4, 2025
ములుగు: 1,308 నామినేషన్లు చెల్లుబాటు

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు స్వీకరించిన నామినేషన్లలో1308 నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు అధికారులు వెల్లడించారు. వెంకటాపూర్, ములుగు, మల్లంపల్లి మండలాల్లోని 52 సర్పంచ్ స్థానాలకు 2004 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. 462 వార్డు స్థానాలకు 1,064 నామినేషన్లు అర్హత సాధించినట్లు తెలిపారు. కాగా ఈ మండలాల్లో ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి.
News December 4, 2025
ఖమ్మం: రసవత్తర పోరు.. సర్పంచ్ బరిలో అన్నదమ్ములు

వైరా మండలంలోని ముసలిమడుగు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం అన్నదమ్ములు ఇద్దరూ బరిలో నిలవడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తడికమళ్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడు తడికమళ్ల నాగార్జున కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో ఈ గ్రామంలోని పోరుపై అందరి దృష్టి నెలకొంది.


