News December 1, 2025

ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటున్నారా?

image

ప్రోటీన్ పౌడర్‌లను సాధారణంగా గుడ్లు, పాలు, సోయా, బఠానీలు లేదా బియ్యం వంటి మొక్కల మూలాలతో తయారు చేస్తారు. కొన్నిసార్లు వీటి మూలాల మిశ్రమంతో తయారు చేస్తారు. చక్కెరతో కూడిన ఈ సప్లిమెంట్‌లు సమతుల్య ఆహారం ఉద్దేశ్యాన్ని విరుద్ధంగా ఉండడమే కాకుండా, మూత్రపిండాలు, ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వైద్యుల సలహా లేకుండా వీటిని వాడకూడదని సూచిస్తున్నారు.

Similar News

News March 12, 2026

జగన్ వ్యాఖ్యలు అబద్ధం: పయ్యావుల

image

AP: జగన్ చేసిన విధ్వంసానికి తాము అప్పుల భారం మోస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రూ.3లక్షల కోట్ల అప్పులు చేసిందన్న జగన్ వ్యాఖ్యలు అబద్ధమని కొట్టిపారేశారు. తాము రూ.1.05 లక్షల కోట్లే అప్పు చేశామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం ఎక్కడా తగ్గలేదని, రెవెన్యూ లోటు ముందు నుంచే ఉందన్నారు. వైసీపీ హయాంలో ఎంత దోపిడీ జరిగిందనేది రేపో, మాపో ఈడీ బయటపెడుతుందని వ్యాఖ్యానించారు.

News March 12, 2026

గ్యాస్ కొరత.. రాష్ట్రాలకు కిరోసిన్ సరఫరా!

image

గ్యాస్‌ కొరత నేపథ్యంలో కేంద్ర ఆయిల్ మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. LPGకి ప్రత్యామ్నాయంగా 40 వేల కిలోలీటర్ల అదనపు కిరోసిన్‌ను రాష్ట్రాలకు కేటాయించినట్లు వెల్లడించింది. మరిన్ని కమర్షియల్ సిలిండర్లను రిలీజ్ చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన లబ్ధిదారులకు వాటిని అందజేస్తామని తెలిపింది. హార్ముజ్‌లో 28 భారత నౌకలు సేఫ్‌గా ఉన్నాయని కేంద్రం చెప్పింది. రోజూ 50Lసిలిండర్లు సరఫరా చేస్తున్నామంది.

News March 12, 2026

ఇరాన్‌కు వ్యతిరేకంగా UNSC తీర్మానం.. భారత్ మద్దతు

image

USపై ప్రతీకారం పేరుతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను భారత్ తప్పుబట్టింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌‌ ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి IND సహా 135 దేశాలు మద్దతు తెలిపాయి. ఇరాన్ వెంటనే దాడులను ఆపాలని డిమాండ్ చేశాయి. ఓటింగ్‌కు చైనా, రష్యా దూరంగా ఉన్నాయి. ఈ తీర్మానాన్ని ఇరాన్ ఖండించింది. తమ పరిస్థితి రేపు మరో దేశానికి రావొచ్చని.. ఇలాంటి తప్పులు చేయొద్దని హెచ్చరించింది.