News December 1, 2025

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ప్రస్తావిస్తా: అరకు ఎంపీ

image

నేటి నుంచి జరగనున్న పార్లమెంటు శీతకాల సమావేశాల్లో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజా రాణి పాల్గొననున్నారు. మొంథా తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారంపై సమావేశాల్లో చర్చించనున్నట్లు ఎంపీ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు తదితర అంశాలపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానన్నారు.

Similar News

News March 20, 2026

‘ఎక్కడ ఉన్నా చంపేస్తాం’.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

image

అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు, సైనికులకు ఇరాన్ IRGC స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘ప్రపంచంలో మీకు ఏ ప్రాంతం సురక్షితం కాదు. రిసార్టులు, టూరిస్టు ప్లేసులు ఇలా మీరు ఎక్కడ ఉన్నా చంపేస్తాం’ అని హెచ్చరించింది. కాగా ఇరాన్ ప్రతినిధులను వరుసగా చంపేస్తుండటంతో IRGC ఈ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
*ఇప్పటివరకు చదవని వార్తల కోసం పైన అన్‌రీడ్ బటన్ క్లిక్ చేసి అప్‌డేట్‌లో ఉండండి.

News March 20, 2026

పల్నాడు జిల్లాలో కనిపించిన నెలవంక

image

పల్నాడు జిల్లాలోని దాచేపల్లిలో శుక్రవారం రాత్రి నెలవంక కనిపించడంతో శనివారం రంజాన్ పండుగ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నెలరోజుల ఉపవాసాన్ని ముస్లింలు విరమించారు. పట్టణంలోని మసీదులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. దాచేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఉన్న ఈద్గా వద్ద శనివారం ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

News March 20, 2026

VKB: పదో తరగతి పరీక్షలు పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

image

VKB జిల్లాలో పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జూమ్ ద్వారా చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.