News December 1, 2025

నల్గొండ: అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులు..!

image

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు సులభంగా అవగాహన కలిగే గుర్తులు వస్తే బాగుంటుంది. ఎక్కువగా వాడకంలో లేని గుర్తులు వస్తే ఓటర్లకు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ మంది పోటీలో ఉంటే అనుకున్న గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News March 6, 2026

భద్రాద్రి రామయ్య కళ్యాణం, పట్టాభిషేకం టికెట్లు సిద్ధం

image

భద్రాద్రి క్షేత్రంలో ఈ నెల 27, 28 తేదీలలో జరగనున్న శ్రీరామనవమి తిరుకళ్యాణ మహోత్సవం, మహా పట్టాభిషేక వేడుకలకు సంబంధించి టికెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు EO తెలిపారు. భక్తులు రేపటి నుంచి https://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ టికెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నట్లు EO వివరించారు.

News March 6, 2026

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లాలో సమగ్ర అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలు వివిధ విభాగాల సమన్వయంతో నిర్వహించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రతి శాఖకు సంబంధించి నోడల్ విభాగాలు, నోడల్ అధికారులు నియమించబడినట్లు తెలిపారు.

News March 6, 2026

ఆరేళ్ల కష్టం.. అరవై ఏళ్ల సుఖం: SP ధీరజ్

image

మదనపల్లెలోని ఓ కళాశాలలో జరిగిన మహిళా భద్రత అవగాహన సదస్సులో కలెక్టర్ నిశాంత్ కుమార్, SP ధీరజ్ పాల్గొన్నారు. 16-22 ఏళ్ల వయస్సు జీవితానికి కీలకమని, ఈ ఆరేళ్లు కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని SP సూచించారు. సోషల్ మీడియా మాయలో పడకుండా, అపరిచితులకు ‘నో’ చెప్పడం నేర్చుకోవాలని ఎస్పీ హితవు పలికారు. వేధింపులపై శక్తి టీమ్‌కు ఫిర్యాదు చేయాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.