News December 1, 2025
NGKL: రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరిన కబడ్డీ జట్టు

నల్గొండ జిల్లాలోని హాలియాలో జరుగుతున్న 51వ రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల కబడ్డీ ఛాంపియన్ షిప్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా బాలికల కబడ్డీ జట్టు పాల్గొనేందుకు బయలుదేరిందని కబడ్డీ సంఘం అధ్యక్షుడు ఎం.జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి A.యాదయ్య గౌడ్ ‘Way2News’తో తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచి జిల్లాకు పేరు తీసుకురావాలని, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో రాణించాలని ఆకాంక్షించారు.
Similar News
News March 19, 2026
ఖమ్మం: ఉద్యోగం లేని వారికి మంచి ఛాన్స్

ఖమ్మం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు DYSO సునీల్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో 3 నెలల శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గలవారు ఆధార్, విద్యార్హత పత్రాలతో నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని, వివరాలకు 99482 07271 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
News March 19, 2026
దివ్యాంగులతో సెల్ఫీ దిగిన కలెక్టర్ లక్ష్మీశా

విజయవాడలో బుధవారం దివ్యాంగ శక్తి పథక ప్రారంభోత్సవంలో కలెక్టర్ లక్ష్మీశా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా RTC బస్ ఎక్కిన ఆయన దివ్యాంగులతో సెల్ఫీ దిగారు. ఈ పథకంతో దివ్యాంగుల సాధికారతకు కొత్త ఊపిరి లభిస్తుందని, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు.
News March 19, 2026
కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 259 మంది విద్యార్థులు డుమ్మా.!

కడప జిల్లాలో బుధవారం సెకండ్ ఇంటర్ కెమిస్ట్రీ పేపర్ -2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలను అధికారులు నిర్వహించారు. నేడు జరిగిన పరీక్షలకు 12,145 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 11,886 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 98% విద్యార్థులు పరీక్షలు రాశారు. 259 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేదు.


