News December 1, 2025

VKB: అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం గుర్తులు..!

image

సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు సులభంగా అవగాహన కలిగే గుర్తులు వస్తే బాగుంటుంది. ఎక్కువగా వాడకంలో లేని గుర్తులు వస్తే ఓటర్లకు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ మంది పోటీలో ఉంటే అనుకున్న గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News March 22, 2026

నంద్యాల కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్ఎస్

image

నంద్యాల కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమాలు జరుగుతాయని కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా అర్జీలు సమర్పించవచ్చని, సమర్పించిన దరఖాస్తుల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే మీకోసం వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేసే సదుపాయం ఉందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

News March 22, 2026

అనకాపల్లి: రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 23వ తేదీన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు వస్తున్న నేపథ్యంలో అధికారులు పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలిపారు. ఈ కారణంగా వీటిని రద్దు చేస్తున్నామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

News March 22, 2026

జిల్లాలో గ్యాస్ కొరత లేదు: జేసీ

image

ఏలూరు జడ్పీ సర్వసభ్య సమావేశంలో జేసీ అభిషేక్ గౌడ్ పాల్గొని జిల్లాలో వంటగ్యాస్ సరఫరాపై కీలక ప్రకటన చేశారు. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేదని, పైప్‌లైన్ ద్వారా సరఫరాను మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 5 వేల కనెక్షన్లను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ పాఠశాలలు, వాణిజ్య విభాగాలకు కూడా అంతరాయం లేకుండా గ్యాస్ అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు.