News December 1, 2025

MDK: గుర్తుల కేటాయింపులో అభ్యర్థులకు టెన్షన్!

image

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల అధికారులు ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు సులభంగా అవగాహన కలిగే గుర్తులు వస్తే ప్రచారం బాగుంటుంది. ఎక్కువగా వాడకంలో లేని గుర్తులు వస్తే ఓటర్లకు ఇబ్బంది కలుగుతుందని, ఎక్కువ మంది పోటీలో ఉంటే అనుకున్న గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News March 7, 2026

గుంటూరు: విద్యుత్ శాఖకు రూ.450 కోట్ల బకాయిలు

image

విద్యుత్ పంపిణీ సంస్థలకు బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో గుంటూరు, సీఆర్డీఏ, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కలిపి రూ.450 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరు సర్కిల్‌లోనే రూ.203 కోట్లు బకాయి కాగా పల్నాడు ప్రాంతంలో రూ.250 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఈ వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. ప్రైవేటు వినియోగదారులకు నోటీసులు ఇస్తున్నారు.

News March 7, 2026

అల్లు అర్జున్‌తో శిల్పా రవి

image

అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహ వేడుకకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం, ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిశారు. ఈ సందర్భంగా శిల్పా రవి దంపతులు అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

News March 7, 2026

28,740 పోస్టులు.. ఫలితాలు విడుదల

image

పోస్టాఫీసుల్లో 28,740 బీపీఎం, GDS, ఏబీపీఎం పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ షార్ట్‌లిస్ట్‌ను తపాలా శాఖ <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంచింది. రాతపరీక్ష లేకుండా పదో తరగతిలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 23లోపు ఒరిజినల్ డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించింది. కాగా APలో 1,060, TGలో 608 ఉద్యోగాలున్నాయి. పోస్టును బట్టి రూ.10వేల నుంచి రూ.29,380గా శాలరీ ఉంటుంది.