News December 1, 2025

VJA: ప్రయాణికులకు అలర్ట్..రైళ్ల రద్దు వివరాలివే.!

image

విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా ఉమ్మడి కృష్ణా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. 2026 JAN 31న నం.22876/75 GNT-VSKP ఉదయ్ ఎక్స్‌ప్రెస్, JAN 28, 29న నం.17219 MTM-VSKP ఎక్స్‌ప్రెస్, JAN 29, 30న నం.17220 VSKP-MTM ఎక్స్‌ప్రెస్, JAN 28న నం.22708 TPTY-VSKP ఎక్స్‌ప్రెస్, JAN 29న నం.22707 VSKP-TPTY ఎక్స్‌ప్రెస్‌లు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలన్నారు.

Similar News

News March 21, 2026

USకు ఇరాన్ పంచ్.. 4000km దూరంలోని బేస్‌పైకి మిస్సైళ్లు

image

యుద్ధంలో ఇరాన్ దాడులు US, ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఇండియానా ఓషన్‌లో ఉన్న US-UK మిలిటరీ బేస్‌ డియాగో గార్షియాపై 2 బాలిస్టిక్ మిస్సైళ్లు సంధించింది. ఇది ఇరాన్‌కు ఏకంగా 4000km దూరంలో ఉండటం గమనార్హం. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఒక మిస్సైల్ గాల్లోనే పేలిపోయిందని US తెలిపింది. మరొకదాన్ని తమ SM-3 ఇంటర్‌సెప్టర్ అడ్డుకుందని పేర్కొంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News March 21, 2026

వెంకట్రావుపేటలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

image

మల్లాపూర్ మండలం వెంకట్రావుపేటలో శనివారం ఉరివేసుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం వెంకట్రావుపేటలోని పెద్దమ్మ తండాకి చెందిన జరుఫుల రమేశ్ అనే వ్యక్తి గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరివేసుకొని మృతి చెందాడు. కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలే ఆయన మృతికి కారణమని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 21, 2026

NGKL: ప్రపంచ రికార్డు దిశగా SLBC సొరంగం

image

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) ప్రాజెక్టులో భాగంగా ఇన్‌లెట్ నిర్మాణ పనులను అధికారులు మళ్లీ ప్రారంభించారు. ఇప్పటికే దేవరకొండ వైపు అవుట్‌లెట్ పనులు సాగుతుండగా, రెండు వైపులా పనులను వేగవంతం చేశారు. 43.93 కి.మీ. పొడవైన ఈ సొరంగం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా రికార్డు సృష్టించనుంది. భద్రతా ప్రమాణాలతో పనులు ఆటంకం లేకుండా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.