News December 1, 2025
వేమిరెడ్డి గారూ.. వీటి గురించి మాట్లాడండి!

నెల్లూరు జిల్లాలో నాట్లు మొదలయ్యాయి. 6లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. ప్రభుత్వం ఎకరాకు 3బస్తాల యూరియానే ఇస్తానంటోంది. ఇటీవల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. రోడ్లు విస్తరించాల్సిన అవసరం ఉంది. రైల్వే లైన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాల్సి ఉంది. గంజాయి నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. నేటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వీటిపై MP వేమిరెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఉంది.
Similar News
News March 15, 2026
నెల్లూరు: 7th క్లాస్ బాలిక..9th క్లాస్ బాలుడికి పెళ్లి

గుడ్లూరు మండలంలో బాల్య వివాహం జరిగింది. 7వ తరగతి చదువుతున్న బాలికకు, 9వ తరగతి చదువుతున్న బాలుడికి వాళ్ల పెద్దలు శుక్రవారం వివాహం జరిపించినట్లు సమాచారం ఒంగోలులోని స్వచ్ఛంద సంస్థకు తెలిసింది. చట్ట విరుద్ధమైన ఈ బాల్య వివాహాన్ని అడ్డుకోవాలని సంస్థ ప్రతినిధి కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీని కోరారు. ఆయన వెంటనే జోక్యం చేసుకొని బాలికను బాలికా సదన్‌కు తరలించాలని ఆదేశించారు.
News March 15, 2026
నెల్లూరు: మహిళా కండక్టర్‌కు HIV ఉందంటూ అవమానం!

నెల్లూరు జిల్లాలోని గూడూరు డిపోకు చెందిన ఓ మహిళా కండక్టర్ తనను వైద్యురాలు అందరిలో అవమానించి, HIV ఉందంటూ తప్పుడు ధ్రువీకరణ ఇచ్చిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ అధికారులు విచారణ జరిపి వైద్యురాలిని మందలించినట్లు తెలుస్తోంది. బాధితురాలు ల్యాబ్‌లో రక్త పరీక్షలు చేయించగా నెగటివ్ రిపోర్టు వచ్చిందని బాధితురాలు తెలిపారు.
News March 15, 2026
నకిలీ సందేశాలను నమ్మవద్దు : విద్యుత్ శాఖ

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు పంపుతున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి శనివారం ఒక ప్రకటనలో కోరారు. మీ విద్యుత్ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని మెసేజ్‌లు వస్తున్నాయన్నారు. మరిన్ని వివరాల కోసం ఒక ఫోన్ నంబరును సంప్రదించాలంటూ సందేశాలు అందుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.


