News December 1, 2025
కాకినాడ అభివృద్ధి కోసం గళమెత్తండి MP సారూ..!

కాకినాడ జిల్లా అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. పోర్ట్ విస్తరణ, కోటిపల్లి-నర్సాపురం రైల్వే, గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఉప్పాడ తీర రక్షణ, అమృత్ జల జీవన్ నిధుల విడుదల అత్యవసరమని ప్రజలు అంటున్నారు. కాకినాడ ఇండస్ట్రియల్ కారిడార్, ఆయిల్ గ్యాస్ ప్రాజెక్టుల విస్తరణ వంటి సమస్యలపై ఎంపీలు ఉదయ్, సతీష్ పార్లమెంట్‌లో గళమెత్తాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News March 7, 2026
అభివృద్ధి లక్ష్యాలపై కలెక్టర్ సమీక్ష

కర్నూలులోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులతో సమావేశం నిర్వహించారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, జిల్లా కీలక పనితీరు సూచికలపై ఆమె చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా తలసరి ఆదాయం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌డీజీ, కేపీఐ అంశాల్లో జిల్లా మరింత పురోగతి సాధించాలని ఆమె స్పష్టం చేశారు.
News March 7, 2026
9న చిత్తూరు DRC సమావేశం

చిత్తూరు కలెక్టరేట్‌లో ఈనెల 9న ఉదయం 11 గంటలకు జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం(డీఆర్సీ) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వివిధ పథకాల అమలుతో పాటు వేసవి దృష్ట్యా తాగునీటి వసతి కల్పనపై కార్యాచరణ ప్రణాళిక, ఇంజినీరింగ్ పనులు, రెవెన్యూ(పీజీఆర్ఎస్, రీసర్వే), వ్యవసాయ, ఉద్యానశాఖ, విద్య, వైద్యఆరోగ్య శాఖ అంశాలపై చర్చించనున్నారు.
News March 7, 2026
KMR: రేపటి నుంచే HPV వ్యాక్సినేషన్: DM&HO

కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల వయస్సు గల బాలికల కోసం HPV టీకా కార్యక్రమాన్ని ఈ నెల 8 నుంచి ప్రారంభించనున్నట్లు డీఎంహెచ్ఓ డా.రవీందర్ గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కామారెడ్డి, ప్రాంతీయ ఆస్పత్రి బాన్సువాడలలో మొదటగా ప్రారంభిస్తామన్నారు. HPV శాస్త్రీయమైన, సురక్షితమైనదని అన్నారు. కుటుంబ సంరక్షకులకు ఆరోగ్య కేంద్రాలకు రావాలన్నారు.


