News December 1, 2025
ఉమ్మడి నల్గొండ జిల్లాకు కొత్తగా 4,917 రేషన్ కార్డులు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నవంబర్‌లో ప్రభుత్వం 4,917 కార్డులను కొత్తగా జారీ చేసింది. దీంతో గత నెల 11,47,560 కార్డులు ఉండగా తాజాగా వాటి సంఖ్య 11,52,477కు చేరింది. యూనిట్ల సంఖ్య గత నెల వరకూ 34,66,221 ఉండగా తాజాగా 14,376 పెరగడంతో 34,80,597కు చేరింది. బియ్యం కోటా గత నెలలో 22,007 టన్నులు ఉండగా 92 టన్నులు పెరిగి 22,099 టన్నులకు చేరింది.
Similar News
News March 9, 2026
కాకినాడ: మృతదేహాల మిస్టరీ వీడింది..!

కోటనందూరు మండలం కాకరపల్లి శివారు చెరువులో లభ్యమైన మృతదేహాలను నర్సీపట్నం ప్రాంతానికి చెందిన భాగ్యలక్ష్మి(35), ఆమె కుమారుడు సాయి(3)గా పోలీసులు సోమవారం గుర్తించారు. కుటుంబ కలహాల వల్ల భాగ్యలక్ష్మి కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI చెన్నకేశవరావు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
News March 9, 2026
విశాఖలో బ్యాడ్మింటన్ ఆడేవారికి గుడ్ న్యూస్

విశాఖపట్నం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ మెంబర్‌షిప్ కోసం జీవీఎంసీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 6 అంతర్జాతీయ స్థాయి కోర్టులతో కూడిన ఈ స్టేడియంలో 12 ఏళ్ల లోపు పిల్లలకు ఏడాదికి ₹2,600, పెద్దలకు ₹15,000 ఫీజుగా నిర్ణయించారు. ఉదయం 5 నుండి 10 వరకు, సాయంత్రం 4 నుండి 10 గంటల వరకు ఆడేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
News March 9, 2026
విశాఖలో మహిళా శక్తి: రాయగడకు ‘ఆల్ ఉమెన్ క్రూ’ స్పెషల్ ట్రైన్!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో మహిళా సాధికారత ప్రతిబింబించింది. భారతీయ రైల్వేలో మహిళల అంకితభావం, నైపుణ్యాన్ని చాటిచెబుతూ విశాఖ నుండి రాయగడ వరకు సోమవారం ‘ఆల్ ఉమెన్ క్రూ’ ప్రత్యేక రైలును అధికారులు ఘనంగా ప్రారంభించారు. లోకో పైలట్ నుండి గార్డ్ వరకు అందరూ మహిళలే కావడం వారి వృత్తిపరమైన శక్తికి నిదర్శనమని, ఇది అందరికీ స్ఫూర్తిదాయకమని రైల్వే అధికారులు తెలిపారు.


