News December 1, 2025
MBNR: రేపే.. U-19 హ్యాండ్ బాల్ ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల, బాలికలకు హ్యాండ్ బాల్ ఎంపికలను ఈనెల 2న మహబూబ్ నగర్ లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్ నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ టెన్త్ మెమో, బోనఫైడ్, ఆధార్ పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలలోపు పీడీకు రిపోర్ట్ చేయాలన్నారు. వివరాలకు 99487 87711కు సంప్రదించాలన్నారు.
Similar News
News March 15, 2026
నంద్యాలలో ‘ఒక్క రూపాయికే’ భోజనం

నంద్యాలలో గోళ్ల రాజేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒక్క రూపాయికే భోజనం కార్యక్రమాన్ని నంద్యాల బ్లడ్ సెంటర్ నిర్వాహకుడు బ్లడ్ అచ్చు అభినందించారు. ఫుడ్ పాయింట్‌ను సందర్శించిన ఆయన.. అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడారు. భోజనం రుచిగా ఉందని వారు తెలిపారు. నంద్యాలకు వచ్చే ప్రజలకు కేవలం ఒక్క రూపాయికే కడుపునిండా భోజనం అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు.
News March 15, 2026
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడ పిడుగులు పడే ఆస్కారముందని చెప్పింది. మరోవైపు ఇవాళ్టి నుంచి 17వ తేదీ వరకు TGలోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, HYD, మేడ్చల్, సిద్దిపేట, ములుగు, కొత్తగూడెంలో ఉరుములతో కూడిన వానలు పడతాయని వాతావరణ నిపుణులు తెలిపారు.
News March 15, 2026
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: డీఐజీ

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జనవరి 1 నుంచి ఈనెల 13వ తేదీ వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఓవర్ స్పీడ్ 1,889, హెల్మెట్ లేకుండా 1,763, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 79 కేసులు నమోదు కాగా, 1,686 డ్రంకెన్ డ్రైవింగ్, 2,223 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.


