News December 1, 2025
బుల్ జోరు.. స్టాక్ మార్కెట్ల సరికొత్త రికార్డులు

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 26,325, సెన్సెక్స్ 86,159 పాయింట్లతో ఆల్ టైమ్ హై టచ్ చేశాయి. బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 60K మార్క్ క్రాస్ చేసింది. కొద్ది నిమిషాల క్రితం నిఫ్టీ 80 పాయింట్లు ఎగసి 26,285 వద్ద, సెన్సెక్స్ 313 పాయింట్లు లాభపడి 86,020 వద్ద కొనసాగుతున్నాయి. బెల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, రిలయన్స్, SBI లాభాల్లో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ITC నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Similar News
News December 5, 2025
హనుమాన్ చాలీసా భావం -29

చారో యుగ ప్రతాప తుమ్హారా|
హై పరసిద్ధ జగత ఉజియారా||
ఓ హనుమా! మీ శక్తి, కీర్తి 4 యుగాలలో ప్రసిద్ధి చెందింది. ఈ సత్యం లోకమంతా విధితమే. మీ ఉనికి ఈ జగత్తు మొత్తానికి కాంతిలా వెలుగునిస్తుంది. మీరు ఈ ప్రపంచంలోని చీకటిని పోగొట్టి, జ్ఞానం, ధైర్యం, ఆనందాన్ని ఇస్తూ, సర్వత్రా వెలుగు పంచుతున్నారు. యుగాలు మారినా, మీ మహిమ మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరక, ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూనే ఉంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 5, 2025
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CSIR-CEERI) ప్రాజెక్ట్ స్టాఫ్ , JRF పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఈ నెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/ఇనుస్ట్రుమెంటేషన్/ఫిజిక్స్‌లో B.Tech/BE/M.Tech/ME/MSc, BSc లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ceeri.res.in/
News December 5, 2025
నన్ను ఎన్నుకున్నది అరిచేందుకు కాదు: శశిథరూర్

ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడుతుండటంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో గొంతు వినిపించేందుకు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదన్నారు. ‘పార్టీలో నాది ఏకైక గొంతు కావచ్చు. కానీ పార్లమెంటులో ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించడానికే నన్ను ఎన్నుకున్నారు. అరవడానికో, గొడవలు చేయడానికో కాదు. వారి కోసం, దేశం కోసం మాట్లాడేందుకు పంపించారు’ అని అన్నారు.


