News December 1, 2025
రైతు సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తుతా: ఏలూరు ఎంపీ

పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు విషయాలను ఆయన పార్లమెంట్లో ప్రస్తావిస్తారని తెలుస్తుంది. ప్రధానంగా రైతుల సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి, అలాగే ఇటీవల ఏలూరు-జంగారెడ్డిగూడెం రహదారిని నాలుగు లైన్ల రహదారిగా మార్చేందుకు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని ఆయన తెలిపారు.
Similar News
News March 13, 2026
కొబ్బరినూనెలో ఇది కలిపి రాస్తే..

కొబ్బరినూనెను జుట్టుకు రాయడం వల్ల జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. కొబ్బరినూనెను కాస్త వేడిచేసి అందులో కాస్త ఉసిరి పొడిని వేయాలి. ఆ మిశ్రమం చల్లారాక దాన్ని మీ జుట్టు, తల చర్మంపై పూర్తిగా పట్టేలా అప్లై చేయండి. అలా గంట పాటు ఉంచి మైల్డ్ షాంపూతో తలస్నానం చెయ్యాలి. దీని వల్ల స్కాల్ప్‌లో రక్త ప్రసరణ పెరుగుతుందని, ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు.
News March 13, 2026
CSK ప్రమోషన్లలో రజినీ సాంగ్స్.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్!

జెర్సీ రివీల్ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ‘కూలీ’ సాంగ్‌తో వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా చేయడాన్ని ‘సన్ టీవీ’ యాజమాన్యం తప్పుబట్టింది. అనుమతి లేకుండా జైలర్, కూలీ, జైలర్-2 సినిమాల పాటలను ఉపయోగించకుండా నిరోధించాలని ‘SUN TV’ మద్రాస్ హైకోర్టులో దావా వేసింది. కాపీరైట్ ఉల్లంఘనపై విచారణ చేపట్టిన జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
News March 13, 2026
వరంగల్: పది పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: ఈస్ట్ జోన్ డీసీపీ

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు విధించినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 150 పరీక్ష కేంద్రాల్లో(HNK 64, WGL 47 జనగామ 39) రేపటి నుంచి ఏప్రిల్ 16 వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్(144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, జిరాక్స్ సెంటర్లను బంద్ చేయాలన్నారు.


