News December 1, 2025

పొద్దుతిరుగుడు నాటిన తర్వాత కలుపు నివారణ

image

పొద్దుతిరుగుడు విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు 200 లీటర్ల నీటిలో 1 లీటర్ పెండిమిథాలిన్30% E.C రసాయనాన్ని కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పంట 30-40 రోజుల దశలో అంతరకృషి చేయాలి. ఇది సాధ్యం కాకపోతే గడ్డి జాతి కలుపు నివారణకు ఎకరాకు 400ml క్విజాలొఫాప్ ఇథైల్ 5% ఇ.సి. లేదా ప్రొపాక్విజాఫాప్ 10% ఇ.సి. 250mlను 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు 2-4 ఆకుల దశలో పిచికారీ చేయాలి.

Similar News

News March 28, 2026

16ఏళ్లలోపు పిల్లలకు ఇండోనేషియాలో SM బ్యాన్!

image

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు ఇండోనేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి దేశంలో 16ఏళ్లలోపు పిల్లలు SM వాడకంపై నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూట్యూబ్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో 16ఏళ్లలోపు పిల్లలు అకౌంట్స్ ఓపెన్ చేయలేరు. ఆస్ట్రేలియా తర్వాత ఈ తరహా కఠిన చట్టాన్ని తెచ్చిన దేశంగా ఇండోనేషియా నిలిచింది.

News March 28, 2026

EPFO యాప్‌తో రూ.5 లక్షల వరకు విత్‌డ్రా!

image

ఉద్యోగులు UMANG యాప్‌తో పాటు EPFO యాప్ ద్వారా కూడా PF నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఉన్న రూ.లక్ష పరిమితిని రూ.5లక్షల(75%) వరకు పెంచారు. ఈ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన UPI PIN ఉపయోగించి సులభంగా పొందవచ్చు. పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, నామినీ అప్‌డేట్ వంటి సేవలు పొందవచ్చని, దీనివల్ల 8 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని EPFO వెల్లడించింది.

News March 28, 2026

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్

image

LPG సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల కేంద్రం ప్రజలను అప్రమత్తం చేసింది. ఫేక్ వెబ్‌సైట్లు, వాట్సాప్ లింకులు, నకిలీ కాల్స్ ద్వారా వినియోగదారుల బ్యాంక్ వివరాలు, OTPలు సేకరించి కేటుగాళ్లు సొమ్ము దోచుకుంటున్నారు. అందుకే ఎవరికీ OTPలు చెప్పవద్దని, ఫేక్ APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దని సూచించింది. కేవలం అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.