News December 1, 2025
MBNR: అరుణాచలానికి స్పెషల్ బస్.. ఫోన్ చేయండి

మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని అరుణాచలం గిరి ప్రదక్షిణకు MBNR డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈ నెల 3న రాత్రి 7గం.కు బయలుదేరుతుందని డిపో మేనేజర్ సుజాత తెలిపారు. 4న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, 5న రాత్రి అరుణాచలం చేరుకొని మరుసటి రోజు గిరిప్రదక్షిణ, 6న MBNRకు చేరుకుంటుందన్నారు. ఛార్జీలు పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ. 2,400 ఉంటుందన్నారు. వివరాలకు 94411 62588, 99853 20529లకు సంప్రదించాలన్నారు.
Similar News
News March 27, 2026
వనపర్తి: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు: ED

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించనున్నట్లు కార్పొరేషన్ ఈడీ సిరాజుద్దీన్ అహ్మద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 2 వరకు https://tgobmms.cgg.gov.in పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వ్యవసాయ పథకాలకు 18-45 ఏళ్లు, వ్యవసాయేతర పథకాలకు 21-50 ఏళ్లు, శిక్షణ కోసం 18-45 ఏళ్ల వయసు ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షల ఆదాయం ఉండాలన్నారు.
News March 27, 2026
ఖమ్మం జిల్లాలో పలువురు తహశీల్దార్ల బదిలీ

జిల్లాలో పాలనా యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కలెక్టర్ అనుదీప్ పలువురు MROలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల సమర్థ నిర్వహణే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టారు. దీనిలో భాగంగా ఖమ్మం అర్బన్ MROగా జయచందర్ డిప్యుటేషన్‌పై నియమితులయ్యారు. అలాగే కల్లూరుకు బ్రహ్మేశ్వరరావు, ఖమ్మం రూరల్‌కు వినయేందర్ రెడ్డి, నేలకొండపల్లికి రామ్ ప్రసాద్, సింగరేణికి వెంకటేశ్వర్లును బదిలీ చేశారు.
News March 27, 2026
మిర్యాలగూడ పార్లమెంటు స్థానంపై చర్చ..!

నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో మిర్యాలగూడ పార్లమెంటు స్థానాన్ని పునరుద్ధరించాలని చర్చ మొదలైంది. 2008లో ఈ స్థానాన్ని నల్గొండలో కలిపిన సంగతి తెలిసిందే. 1962 నుంచి 2004 వరకు ఈ నియోజకవర్గం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడను తిరిగి లోక్‌సభ స్థానంగా మార్చాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.


