News December 1, 2025
MBNR: ఓపెన్ డిగ్రీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల

MBNR డా.బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫీజును డిసెంబర్ 27లోగా ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ చెప్పారు. ఈ పరీక్షలు 2026 ఫిబ్రవరి 7 నుంచి 28 వరకు జరుగుతాయని తెలిపారు. పూర్తి వివరాలకు 73829 29609ను సంప్రదించాలని పేర్కొన్నారు.
Similar News
News December 3, 2025
ఎన్నికల ప్రచార ఖర్చు పకడ్బందీగా నమోదు చేయాలి: పరిశీలకులు

ఎన్నికల ప్రచార ఖర్చును పకడ్బందీగా నమోదు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్ సూచించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచార ఖర్చు వివరాలను మూడు సార్లు ఎన్నికల పరిశీలకుల ముందు తప్పనిసరిగా హాజరై చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రచార సర్వేను పరిశీలకులు పూర్తిగా పర్యవేక్షించాలని సూచించారు.
News December 3, 2025
TG హైకోర్టు న్యూస్

* బీసీ రిజర్వేషన్లపై స్టేను హైకోర్టు పొడిగించింది. జనవరి 29 వరకు జీవో 9ని నిలిపివేస్తూ ఉత్తర్వులు.. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా
* లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో లిఫ్ట్, ఎలివేటర్ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు.. చట్టం రూపొందించడానికే పదేళ్లు పడితే అమల్లోకి తేవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని ప్రశ్న. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా
News December 3, 2025
అన్నమయ్య జిల్లాలో తాత్కాలిక అకాడమిక్ చాత్రోపాధ్యాయ నియామకాలు

అన్నమయ్య జిల్లా 17 మండలాల్లో 48 పాఠశాలల్లో D.Ed./ B.Ed. పూర్తి చేసిన అభ్యర్థులను 2025-26 విద్యా సంవత్సరానికి 5 నెలల వ్యవధికి తాత్కాలిక అకాడమిక్ చాత్రోపాధ్యాయగా నియమించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్హతగల అభ్యర్థులు తమ దరఖాస్తులను 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మండల విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని DEO సుబ్రహ్మణ్యం తెలిపారు.


