News December 1, 2025
ADB: ఎన్నికలు.. ప్రత్యర్థులను తప్పించే ప్రయత్నాలు!

ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తొలి విడత నామినేషన్లు పూర్తి కావడం, రెండో విడత ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే కొన్ని గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం ద్వారా సర్పంచ్లు, వార్డు మెంబర్లను ఎన్నుకున్నారు. తమ గెలుపుపై ప్రభావం చూపుతారని భావించిన మరి కొందరు డబ్బు లేదా ఇతర మార్గాల ద్వారా ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాల్లో శరవేగంగా నిమగ్నమయ్యారు.
Similar News
News March 16, 2026
ఖమ్మం: బడ్జెట్ సమావేశాలు.. నిధుల మోక్షం కలిగేనా?

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, 20న డిప్యూటీ సీఎం భట్టి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు క్యాబినెట్‌లో కీలకం కావడంతో..సీతారామ, పాలేరు జేఎన్‌టీయూ, ఇందిరమ్మ ఇళ్లు, పర్యాటక కారిడార్‌కు నిధులు వస్తాయని ఎదురుచూస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణకు ఈ బడ్జెట్ ఎంతవరకు ఊతమిస్తుందో వేచి చూడాలి.
News March 16, 2026
గ్యాస్ సిలిండర్ రావాలంటే ఇలా చేయండి..

LPG సిలిండర్ల సరఫరాలో అంతరాయం నెలకొన్న నేపథ్యంలో బుకింగ్ & డెలివరీ సమయంలో ఆటంకాలు రావొద్దంటే వెంటనే eKYC పూర్తి చేయాలని కేంద్రం సూచించింది. సబ్సిడీ ఆగిపోకుండా, కనెక్షన్ యాక్టివ్‌గా ఉండాలంటే ఇది తప్పనిసరని పేర్కొంది. దీనికోసం1800 233 3555 నంబర్‌కు లేదా మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించండి. లేకపోతే మీ ఆయిల్ కంపెనీ యాప్ డౌన్‌లోడ్ చేసి ‘Aadhaar FaceRD’ యాప్ సాయంతో ఇంటి నుంచే KYC చేసుకోవచ్చు. SHARE IT
News March 16, 2026
నేడు వరంగల్ మార్కెట్ ప్రారంభం

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. శని, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన, తేమలేని సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.


