News April 18, 2024
గుంటూరు: కాలువలో మృతదేహం

జిల్లాలోని నగరం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని అఖిలేరు కాలవలో 30 నుంచి 40 సంవత్సరాల మధ్య గల గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. ఎస్సై కోటేశ్వరరావు తెలిపిన వివరాలు.. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, ఫ్రెంచ్ గడ్డం, సిమెంట్ కలర్ కాటన్ ప్యాంట్, ఎరుపు, నలుపు రంగు చెక్స్ చొక్కా, నలుపు రంగు బెల్ట్ ధరించి, గోల్డ్ కలర్ బకిల్ కలిగి ఉందన్నారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News October 31, 2025
GNT: వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తుపాన్ సమస్యలపై ఆరా

తుపాన్ కారణంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ యాప్ను సైతం ఉపయోగిస్తోంది. యాప్ ద్వారా సంక్షిప్త సందేశాలను ప్రజలకు పంపిస్తోంది. తుపాను కారణంగా మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలంటూ సందేశాలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను తెలుసుకుని సత్వరమే వాటిని పరిష్కరించేందుకు ఈ విధానం దోహదపడుతుందని భావిస్తున్నారు.
News October 30, 2025
ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజ్కి వరద ఉద్ధృతి పెరుగుతుంది. గురువారం సాయంత్రం 7గంటలకు వరద 5.66 లక్షల క్యూసెక్యులకు చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. బ్యారేజ్ నీటిమట్టం 15 అడుగులకు చేరింది. అధికారులు అన్ని గేట్లు ఎత్తి 5.66 లక్షల క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News October 30, 2025
ANU: దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో జులై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను VC గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ తృతీయ సెమిస్టర్, ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అవసరమైన విద్యార్థులు నవంబర్ 12వ తేదీలోగా రీవాల్యుయేషన్ కు దరఖాస్తులు అందించాలని సూచించారు.


