News December 1, 2025

MBNR: అభ్యర్థుల్లో టెన్షన్.. ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులు!

image

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ముగియడంతో, ఇప్పుడు గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ క్రమం ప్రకారం గుర్తులు కేటాయించనున్నారు. ఓటర్లకు సులభంగా అర్థమయ్యే సాధారణ గుర్తులు వస్తే బాగుంటుందని, లేదంటే ఇబ్బంది కలుగుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు.

Similar News

News March 21, 2026

విద్యుత్ ప్రమాదాల నివారణకు ఎల్సీ యాప్: ఎస్ఈ

image

విద్యుత్ ఉద్యోగుల భద్రత, ప్రమాదాల నివారణకు కొత్తగా ఎల్సీ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చామని ఎన్పీడీసీఎల్ వరంగల్ ఎస్ఈ గౌతమ్ రెడ్డి తెలిపారు. డిజిటల్ పద్ధతిన లైన్ క్లియర్ విధానం అమలులోకి వచ్చిందన్నారు. ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి లీడర్ వివరాలు పని చేయాల్సిన స్థానం వివరంగా కనిపిస్తాయని చెప్పారు.

News March 21, 2026

NZB: మాయమవుతున్న అడవి.. మంటగలుస్తున్న ప్రకృతి!

image

​నిజామాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఆందోళనకరంగా తగ్గుతోంది. గత రెండు దశాబ్దాల్లో సుమారు 580 హెక్టార్ల అటవీ సంపద హరించుకుపోయింది. ముఖ్యంగా అటవీ అంచున ఉన్న గ్రామాల్లో ‘పోడు సాగు’ పెరగడం వల్ల చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. వందల ఎకరాల అటవీ భూమి సాగు భూమిగా మారుతోంది. అటవీ అధికారులు నిఘా పెంచినప్పటికీ, పోడు సాగును అరికట్టడం సవాలుగా మారింది.

# నేడు ప్రపంచ అటవీ దినోత్సవం

News March 21, 2026

₹18 కోట్లు చెల్లించి హార్ముజ్‌ను దాటిన నౌక!

image

హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే ఆయిల్ ట్యాంకర్ల నుంచి ఇరాన్ <<19429670>>టోల్ ఫీజు<<>> వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సేఫ్‌గా వెళ్లేందుకు ఓ చమురు నౌక $2 మిలియన్లు(₹18.7 కోట్లు) చెల్లించినట్లు లాయిడ్స్ లిస్ట్ వెల్లడించింది. ఇండియా, మలేషియా, చైనా, పాక్ సహా పలు దేశాలు తమ నౌకలకు సురక్షిత మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్‌తో చర్చిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటిదాకా 9 నౌకలు ఇరాన్ తీరం నుంచి వెళ్లినట్లు పేర్కొంది.