News December 1, 2025
కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా మీదుగా అనకాపల్లి(AKP)-సికింద్రాబాద్(SC) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07041 SC-AKP రైలు డిసెంబర్ 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం, నం.07042 AKP-SC రైలు డిసెంబర్ 8 నుంచి 29 వరకు ప్రతి సోమవారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని చెప్పారు.
Similar News
News March 16, 2026
మోనాలిసా మైనర్.. పెళ్లి చెల్లదు: అంకుల్ విజయ్

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా మైనర్ అని, 2009లో పుట్టారని ఆమె అంకుల్ విజయ్ భోస్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్‌పోర్టు పత్రాల్లో ఆమె వయసును ఎక్కువ చేసి చూపారని తెలిపారు. ఫర్మాన్ ఖాన్‌తో వివాహం చట్టబద్ధంగా చెల్లదని పేర్కొన్నారు. ఈ పెళ్లి లవ్ జిహాదేనని ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా <<19360382>>మరోసారి<<>> స్పష్టం చేశారు. ఈ విషయాన్ని త్వరలోనే మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
News March 16, 2026
పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిరి

కర్నూలు ఏ క్యాంప్‌లోని ఇందిరాగాంధీ స్మారక నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సోమవారం పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వసతులపై విద్యాశాఖ అధికారులతో చర్చించారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచామని ఏపీసీ లోకరాజు తెలిపారు. నిబంధనల ప్రకారం పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.
News March 16, 2026
జమ్మికుంట: రైల్వే ట్రాక్‌పై వరుస ఆత్మహత్యలు..!

జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో గత వారం రోజుల్లో ముగ్గురు వ్యక్తులు రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడే ప్రాణాలు తీసుకుంటుండడంతో పట్టణవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. క్షణికావేశంలో సులభ మార్గంగా రైల్వే ట్రాక్‌ను ఎంచుకుంటున్నారని భావిస్తున్నారు. ఇటువంటి ఘటనలు నివారించేందుకు పోలీసులు పహారా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.


