News December 1, 2025
వేములవాడ: పార్వతీపురం- ఆలయంవైపు వాహనాలకు NO ENTRY

వేములవాడ పట్టణంలోని పార్వతీపురం నుంచి భీమేశ్వరాలయంవైపు వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో నటరాజ విగ్రహం పరిసరాల్లో భక్తుల సంచారం ఎక్కువ అవుతోంది. పార్వతీపురం నుంచి వచ్చే భక్తుల వాహనాలతో మరింత ఇబ్బందిగా మారింది. దీంతో ఈ ప్రాంతం నుంచి భీమేశ్వరాలయంవైపు వాహనాలు రాకుండా అన్నదాన సత్రం వద్ద ప్రత్యేకంగా గేటు ఏర్పాటు చేశారు.
Similar News
News March 13, 2026
మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు UPSC నోటిఫికేషన్

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కింద వివిధ ప్రభుత్వ విభాగాల్లోని మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,358 పోస్టులు కాగా ఇందులో సెంట్రల్ హెల్త్ సర్వీసెస్‌లో 864 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు రైల్వే, ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, ఢిల్లీ కార్పొరేషన్‌లో 494 ఖాళీలు ఉన్నాయి. UPSC <
News March 13, 2026
మెదక్: ఇంటర్ పరీక్షలకు 98.12 % హాజరు

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 4,801 మందికి గాను 4,711 మంది, ఒకేషనల్ విభాగంలో 267 మందికి గాను 262 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 98.12 శాతం హాజరు నమోదైందని అధికారి మాధవి తెలిపారు. నేటితో జనరల్ విభాగం పరీక్షలు పూర్తయ్యాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆమె పేర్కొన్నారు.
News March 13, 2026
సింహాచలం వెళ్తున్న వారికి గుడ్‌న్యూస్

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌లు ప్రారంభమయ్యాయి. ఈ యంత్రాల ద్వారా భక్తులు క్యూలో నిల్చునే పనిలేకుండా QR కోడ్ స్కాన్ చేసి క్షణాల్లో దర్శన టికెట్లు పొందవచ్చు. కొండపైన గల బస్టాండ్, PRO కార్యాలయ ఆవరణలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ సేవలను EO వెంకట్రావు శుక్రవారం ప్రారంభించారు. భక్తులకు వేగంగా దర్శన భాగ్యం కల్పించడమే తమ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు.


