News December 1, 2025
HYD: RRRకు సర్వీస్ రోడ్డు లేదు!

సాధారణంగా ఔటర్ రింగ్ రోడ్డుకు సర్వీస్ రోడ్లు ఉంటాయి. అయితే గ్రేటర్ HYD చుట్టూ నిర్మిస్తున్న RRRకు సర్వీస్ రోడ్డు నిర్మించడం లేదు. దీనికి బదులు యాక్సిస్ పాత్ రోడ్లు నిర్మించాలని NHAI నిర్ణయించింది. కనెక్టివిటీని పెంచడంతోపాటు సులువుగా ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఆర్ఆర్ఆర్ చుట్టూ ఎక్కువగా పొలాలు ఉండటంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ రోడ్లతో రైతులకు పొలాలకు కూడా వెళ్లేందుకు వీలుగా ఉండనుంది.
Similar News
News December 3, 2025
ముందుగా ఆర్డినెన్స్.. తర్వాత వీలిన నోటిఫికేషన్

గ్రేటర్ HYDలో మున్సిపాలిటీల విలీనానికి సంబంధించి ఆర్డినెన్స్ రావాల్సి ఉంది. వీలీన ప్రక్రియను గవర్నర్ ఇప్పటికే ఆమోదించడంతో త్వరలో ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఆ తర్వాత 3 రోజులకు ఇందుకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వస్తుంది. ఇందుకోసం అధికారులు పేపర్‌వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా వార్డుల విభజనకు సంబంధించి ప్రజాభిప్రాయం కూడా సేకరించనున్నారు.
News December 3, 2025
HYD: మౌలమేలనోయి.. అది శిక్షార్షమోయి!

నేరం జరిగిందని మీకు తెలుసా? మనకెందుకులే అని ఊరికే ఉన్నారా? అయితే మీరు నేరం చేసినట్లే లెక్క. తప్పు జరిగిందని తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. విచారణలో ఈ విషయం వెల్లడైతే మీపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనలో మౌనంగా ఉన్న ఇద్దరు మహిళలను పోలీసులు నిందితులుగా చేర్చారు. BNS సెక్షన్ 211, 33 ప్రకారం అభియోగాలు నమోదు చేస్తారు.
News December 3, 2025
HYD: కుక్క దాడిపై సీఎం తీవ్ర ఆవేదన

మూగ బాలుడు <<18449713>>ప్రేమ్ చంద్‌పై<<>>వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని, అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబానికి అవసరమైన తక్షణ సాయాన్ని ప్రభుత్వం పరంగా అందించాని అధికారులను ఢిల్లీనుంచి ఆదేశించారు. GHMC కమిషనర్ స్వయంగా బాలుడిని పరామర్శించి, వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు.


