News December 1, 2025

సూర్యాపేట: ఫస్ట్ విడత నామినేషన్ వివరాలు ఇలా..!

image

స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో 8 మండలాలకు (సూర్యాపేట, తుంగతుర్తి రెవెన్యూ డివిజన్లు) సంబంధించి 159 సర్పంచ్ స్థానాలకు 1,384 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 1,442 వార్డు స్థానాలకు 3,771 నామినేషన్లు వచ్చాయి. వీటిని అధికారులు పరిశీలించి తిరస్కరణ, ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.

Similar News

News April 7, 2026

భువనగిరి: పేదల ఫ్రిజ్’లకు భలే గిరాకీ..!

image

యాదాద్రి జిల్లాలో ఎండలు మండిపోతుండడంతో ప్రజలు చల్లటి నీటి కోసం మట్టి కుండలను ఆశ్రయిస్తున్నారు. ‘పేదల ఫ్రిజ్’గా పిలిచే ఈ కుండల విక్రయాలు భువనగిరి పట్టణంలో జోరుగా సాగుతున్నాయి. పరిమాణాన్ని బట్టి ఒక్కో కుండ ధర రూ.150 నుంచి రూ.350 వరకు పలుకుతోంది. ముఖ్యంగా ట్యాప్ సౌకర్యం ఉన్న కుండలకు మార్కెట్‌లో భలే డిమాండ్ ఉందని, విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయని వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News April 7, 2026

ASF: ఈనెల 8 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు

image

ASF జిల్లాలో సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-2) పరీక్షలు ఈనెల 8 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. 1నుంచి 7వ తరగతులకు ఉదయం 9 నుంచి 11:30 వరకు, 8వ తరగతికి 11:45 వరకు, 9వ తరగతికి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయి. ఫిజికల్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు ఉ.10:30కే ముగుస్తాయి. పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.

News April 7, 2026

అంతరాష్ట్ర ప్రాజెక్టుపై కసరత్తు.. కృష్ణా నదిపై కొత్త బరాజ్

image

జూరాల ప్రాజెక్టు ఎగువన కొత్తగా బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రతిపాదనల నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి కర్ణాటక అధికారులను కలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం కుదిరితే కొన్ని టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది.