News December 1, 2025
జిల్లాలో 2,28,968 మందికి రూ. 98.91 కోట్లు పంపిణీ: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందజేస్తోందని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. విజయవాడ గులాబీతోటలో సోమవారం నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, లబ్ధిదారులతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకున్నారు. జిల్లాలో 2,28,968 మందికి రూ. 98.91 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పారదర్శకతతో పథకాలను అమలు చేస్తూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News April 3, 2026
హార్ముజ్ To ఇండియా.. షిప్‌కు ఎంత టైమ్ పడుతుంది?

ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధి నుంచి షిప్స్/ట్యాంకర్లు భారత పశ్చిమ తీరానికి చేరుకోవడానికి లోడు, రూట్‌ను బట్టి సాధారణంగా 2-3 రోజులు పడుతుంది. సుమారు 1000KM దూరంలోని కాండ్లా(GJ) పోర్టుకు 36-40 గంటల్లో నౌకలు చేరుకుంటాయి. ముంబై(MH)కి రావడానికి 50-55 గంటలు అవుతుంది. ఆయిల్ ట్యాంకర్లు సగటున గంటకు 24-37 KM వేగంతో ప్రయాణిస్తాయి. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్‌ను ఇరాన్ మూసేయడం తెలిసిందే.
News April 3, 2026
BREAKING: పెరిగిన బంగారం ధర

నిన్న భారీగా తగ్గిన బంగారం ధర ఇవాళ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,960 పెరిగి రూ. రూ.1,50,930కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 ఎగబాకి రూ.1,38,350 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,55,000గా ఉంది.
News April 3, 2026
ములుగు జిల్లాలోని 85 గొత్తికోయ గ్రామాలకు సోలార్ విద్యుత్

ములుగు జిల్లాలోని 85 గొత్తికోయ గ్రామాలకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,020 కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందించనున్నారు. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు స్థిరమైన విద్యుత్ సదుపాయం కల్పించడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రామాల అభివృద్ధికి దోహదం అవుతుందని అధికారులు తెలిపారు.


