News December 1, 2025

కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం

image

కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జిని MP శ్రీభరత్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పిలా శ్రీనివాసరావు, MLA వెలగపూడి, VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. సముద్ర మట్టానికి సుమారు 1020 అడుగుల ఎత్తులో సురక్షితమైన పద్ధతిలో ఈ వంతెన నిర్మించినట్లు ప్రణవ్‌ వివరించారు. త్వరలోనే త్రిశూల్ ప్రాజెక్ట్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

Similar News

News December 3, 2025

ఏపీలో ఫిలిం టూరిజానికి మాస్టర్ ప్లాన్: మంత్రి దుర్గేష్

image

ఆంధ్రప్రదేశ్‌లో ఫిల్మ్ టూరిజానికి ప్రోత్సాహం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ప్రకటించారు. ఏపీని దేశంలోనే సినిమా షూటింగ్‌లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. విశాఖ బీచ్‌లు, గోదావరి నదీ తీరాలు, అరకు, లంబసింగి, తిరుపతి, శ్రీశైలం వంటి ప్రదేశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

News December 3, 2025

నవ దంపతులతో సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

image

కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందరూ కోరుకుంటారు. అలా వర్ధిల్లాలనే వారితో సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం ఆచరిస్తే వారి జీవితంలో సకల సంపదలు, సౌభాగ్యాలు, సత్సంతానం కలుగుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పాడని నమ్ముతారు. సత్యనారాయణ స్వామి త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం కాబట్టి, ఆయన ఆశీస్సులు ముందుగా పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

News December 3, 2025

ఊట వేసిన మడి, వాత వేసిన పశువు

image

‘ఊట వేసిన మడి’ అంటే నీటి లభ్యత పుష్కలంగా ఉన్న పొలం (మడి). ఇది ఎప్పుడూ పచ్చగా, సమృద్ధిగా ఉంటుందని, దిగుబడి బాగా వస్తుందని అర్థం. అలాగే పూర్వకాలంలో పశువులకు (ముఖ్యంగా ఆవులు, ఎద్దులు) వ్యాధులు వచ్చినప్పుడు లేదా గాయాలు తగిలినప్పుడు ‘వాత’ వేసి చికిత్స అందించి నయం చేసేవారు. ఇలా ఊట వేసిన మడి, వాత వేసిన పశువు వల్ల రైతుకు మేలే జరుగుతుందని ఈ సామెత చెబుతుంది.