News December 1, 2025
HYD: ఇష్టారీతిగా ప్రైవేట్ స్కూల్ ఫీజులు వసూళ్లు!

నగరంలో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తమ జేబులు ఖాళీ చేయడంమే లక్ష్యంగా ప్రైవేట్ స్కూల్స్ ఉంటున్నాయని పేరెంట్స్ వాపోతున్నారు. ట్యూషన్, స్పెషల్ ఫీజులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు నియంత్రణ చేపటకపోవడంతో, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నారు. దీనిపై సహించేది లేక విద్యాశాఖకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులు యోచిస్తున్నారు.
Similar News
News March 21, 2026
HYD: బడ్జెట్‌లో పోలీస్ కమిషనరేట్లకు నిధులు

HYD, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్లకు కలిపి బడ్జెట్ లో రూ.387 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇందులో అత్యధికంగా HYD పోలీసు విభాగానికి రూ.310 కోట్లు కేటాయించగా…ఆ తర్వాత ఇటీవల కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కు రూ.40 కోట్లను కేటాయించారు. సైబరాబాద్ కు రూ.20 కోట్లు, మల్కాజిగిరికి రూ.17 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు.
News March 21, 2026
మరో రెండు LPG నౌకలు వచ్చేస్తున్నాయ్!

పశ్చిమాసియా యుద్ధం కారణంగా హార్ముజ్ వద్ద నిలిచిపోయిన నౌకల్లో 2 భారత్ రానున్నాయి. LPG ఉన్న పైన్ గ్యాస్, జగ్ వసంత్ షిప్‌లు ప్రస్తుతం UAEలోని షార్జా వద్ద ఉన్నాయి. ఇవి భారత జెండాతో నేటి నుంచి ప్రయాణించే అవకాశం ఉంది. గతవారం రెండు LPG నౌకలను ఇరాన్ వదిలిపెట్టడంతో అవి మనదేశానికి చేరుకున్నాయి. వీటికి కూడా ఇరాన్ అడ్డుకట్ట వేయదని IND భావిస్తోంది. ఈ రెండు నౌకలు వస్తే దేశంలో గ్యాస్ కొరత కాస్త తీరనుంది.
News March 21, 2026
నర్మెట్టకు సీఎం రేవంత్ రెడ్డి.. షెడ్యూల్ ఖరారు

ఈనెల 22 నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం, వివేక్‌లు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పర్యటనలో ఫ్యాక్టరీని ప్రారంబిచి ఫైలాన్ ఆవిష్కరిస్తారు.


