News December 1, 2025

నల్గొండ: సర్పంచ్ ఎన్నికలు.. పార్టీలకు మరో తలనొప్పి..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా చోట్ల రెండు, మూడు మధిర గ్రామాలు ఓ మేజర్ గ్రామ పంచాయతీ కింద కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం మేజర్ గ్రామాల నేతలకు, మధిర గ్రామాల నేతలకు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తమ గ్రామంలో ఓట్లు ఎక్కువ ఉన్న కులం వారికే సర్పంచ్ రిజర్వేషన్ వచ్చిందని, అందుకే తమ గ్రామంలోని అభ్యర్థులకే ప్రధాన పార్టీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలకు కొత్త తలనొప్పి వచ్చి పడింది.

Similar News

News March 16, 2026

కర్నూలు జిల్లాలో మొదటి రోజే 1042 మంది విద్యార్థులు గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షల్లో 1042 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో సుధాకర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 35851 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా.. 34809 మంది విద్యార్థులు హాజరయ్యారు. 702 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సిందిగా 650 మాత్రమే హాజరయ్యారు. 52 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.

News March 16, 2026

ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం చేస్తాం: SP

image

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 75 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News March 16, 2026

ADB: బహిరంగంగా మద్యం తాగుతున్నారా? అయితే జైలుకే!

image

ఆదిలాబాద్ జిల్లాలో ఓపెన్ డ్రింకింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని పట్టుకునేందుకు ప్రతిరోజు 20 ప్రత్యేక పోలీస్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్ల పక్కన మద్యం తాగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించేది లేదని, నేరుగా FIR నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. నేర రహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలని కోరారు.