News December 1, 2025

ములుగు: వాళ్లెందుకో వెనుకబడ్డారు..!

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడో వెనకబడిందా..!? అనే సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కూడా ఆపార్టీ నేతలు ప్రభావవంతంగా పని చేయడం లేదనే విమర్శలున్నాయి. జిల్లా అధ్యక్షుడు/ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మధ్య విబేధాలే కారణంగా తెలుస్తోంది. ఓ నేతకు ఆర్థిక సమస్య ఇబ్బందిగా మారిందని కేడర్ గుసగుసలాడుతోంది.

Similar News

News April 3, 2026

పెంచలకోన బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం: MLA

image

పెంచలకోన శ్రీపెనుశిల లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహిస్తామని వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు. దేవస్థానం ప్రాంగణంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు ఉత్సవాలు జరుగుతాయని, భక్తులకు దర్శనం, అన్నదానం, తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరచాలని ఆదేశించారు. సీసీ కెమెరాలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.

News April 3, 2026

13న బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి?

image

TG: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం ఖాయమైందని సమాచారం. ఈ నెల 7న కేటీఆర్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. 13వ తేదీన జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత జగిత్యాలలోనే పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు BRS సన్నాహాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

News April 3, 2026

మెదక్: ఇసుక విక్రయాల ఆదాయంలో భారీ వృద్ధి 

image

గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2025-2026 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 3.71లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయాలు జరగ్గా, రూ.1,008 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు GOVT ఇసుక మాఫియాను సమర్థంగా అరికట్టింది. గతేడాది ప్రభుత్వం రూ.738కోట్లు మాత్రమే ఆర్జించింది.  స్థానికంగా ఇసుక లభ్యతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో 17, HYD చుట్టూ 4 ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది.