News December 1, 2025

HYD: మెగా జలమండలి.. DPRపై ఫుల్ ఫోకస్

image

గ్రేటర్ HYD సహా వివిధ ప్రాంతాలకు విస్తరించి ఉన్న జలమండలి ఇప్పుడు మరింత విస్తరణకు శ్రీకారం చుట్టింది. DPR సిద్ధం చేయడంలో నిమగ్నమైనట్లు అధికారులు తెలిపారు.1450.3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జలమండలి మరో 603 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెగా జలమండలిగా తాగునీరు, డ్రైనేజీ నెట్వర్క్ సిద్ధమవుతోంది.

Similar News

News March 21, 2026

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో 59 నియామకాలు పూర్తి: ఛైర్మన్

image

తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో 60 పోస్టులకు 59 నియామకాలు పూర్తి చేశామని టీఎస్ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, అటెండెంట్ విభాగాల్లో ఎంపికలు జరిగాయి. అకడమిక్ మార్కులు, అనుభవం, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేశారు. అభ్యర్థులు 23-25 తేదీల్లో ఆన్‌లైన్ ఫారాలు పూర్తిచేసి 30న హైదరాబాద్ పెట్లబుర్జ్ సీఏఆర్ కార్యాలయంలో ఇవ్వాలన్నారు.

News March 21, 2026

‘ధురంధర్ 2’ సంచలనం.. ₹331 కోట్ల కలెక్షన్లు!

image

ధురంధర్ 2 మూవీ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. రిలీజైన 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹331 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు Sacnilk తెలిపింది. ఇండియాలో ₹267 కోట్లు, ఓవర్సీస్‌లో ₹64 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొంది. ఇండియాలో ప్రివ్యూస్‌తో ₹51కోట్లు, తొలిరోజు ₹121 కోట్లు, రెండోరోజు ₹96 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పింది. వీకెండ్ కావడంతో మరో 2 రోజుల్లో మూవీ ₹500 కోట్ల క్లబ్‌లో చేరే ఛాన్స్ ఉంది.

News March 21, 2026

మందస : బైక్ యాక్సిడెంట్.. వ్యక్తి మృతి..!

image

మందస మండలం కొర్రాయిగేటు బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రపుకొత్తూరు(M) పూండిగోవిందపురానికి చెందిన లావేటి మనోజ్ (21) చికిత్స పొందుతూ మృతి చెందాడు. కార్పెంటర్ పనిచేసే మనోజ్ పని ముగించుకుని ఇంటికి వచ్చే తరుణంలో బైకు అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్లు మందస ఎస్ఐ కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.