News December 1, 2025

HYD: మెగా జలమండలి.. DPRపై ఫుల్ ఫోకస్

image

గ్రేటర్ HYD సహా వివిధ ప్రాంతాలకు విస్తరించి ఉన్న జలమండలి ఇప్పుడు మరింత విస్తరణకు శ్రీకారం చుట్టింది. DPR సిద్ధం చేయడంలో నిమగ్నమైనట్లు అధికారులు తెలిపారు.1450.3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జలమండలి మరో 603 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెగా జలమండలిగా తాగునీరు, డ్రైనేజీ నెట్వర్క్ సిద్ధమవుతోంది.

Similar News

News March 22, 2026

HYD: ముంచుకొస్తోంది.. జర జాగ్రత్త!

image

వేసవి దృష్ట్యా HYDలో ఒక్కపూట బడులు సాగుతున్నాయి. ఈ గ్యాప్‌లో పిల్లలు సరదాగా ఈతకు వెళ్తుంటారు. ఒక్కోసారి ఈసరదా వెంటే విషాదం పొంచి ఉండే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాదీలు గతేడాది 8 మంది లోతు తెలియక, ప్రవాహ తాకిడికి మునిగిపోయారు. వేసవిలో రోజుకు నలుగురి చొప్పున ఈత సరదాకు బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. పెద్దలు, నిపుణుల సమక్షంలో పిల్లలకు ఈత నేర్పండి.

News March 22, 2026

HYDలో నేటి నుంచి బంద్

image

నగరవాసులను నెలరోజులుగా ఆకట్టుకున్న నైట్ బజార్ నేటి నుంచి ఉండదిక. శనివారం పాతబస్తీలో అక్కడక్కడా కనిపించినా నేటి నుంచి 24Hrs షాపింగ్‌కు తెరపడనుంది. లాడ్ బజార్‌లో గాజులు, చార్మినార్ ముందు అత్తరు, ఖర్జూరాలు, డ్రైఫ్రూట్స్ కోసం నైట్ బజార్‌కు పోటెత్తారు. మొహబ్బత్ కా షర్బత్, కబాబ్స్, పత్తర్ కా ఘోష్ బాగా సేల్ అయ్యాయని నిర్వాహకులు చెబుతుతున్నారు. గ్యాస్ కొరత ఉన్నా.. హలీం,బిర్యానీ సప్లై తగ్గలేదని ఫుడీస్ మాట.

News March 22, 2026

HYD: రేపటి నుంచి లైఫ్ ట్యాక్స్ రద్దు

image

అదనపు వాహనాలు కొనుగోలు చేసే వారికి పడే 2% లైఫ్ ట్యాక్స్‌ను ఈ నెల 23 నుంచి రద్దు చేస్తున్నట్లు HYDలోని అధికారులు తెలిపారు. ఈ మేరకు వాహన్ పోర్టల్‌ అందుబాటులోకి రానుందని అన్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తారని దీని ద్వారా దేశంలో ఉన్న అన్ని వాహనాల వివరాలు ఒకే గొడుగు కిందికి రానున్నాయని వెల్లడించారు. 2% పన్ను ఎత్తివేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
# SHARE IT