News December 1, 2025

పిన్నెల్లి సోదరుల కేసుపై సుప్రీం కోర్టు ఆగ్రహం

image

పల్నాడు జంట హత్యల కేసులో పోలీసుల విచారణలో నమోదైన 161 వాంగ్మూలాలు నేరుగా నిందితులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడి చేతికి చేరడంతో సంచలనం రేగింది. ఈ పత్రాలను సుప్రీం కోర్టులో సమర్పించడంతో ధర్మాసనం తీవ్రంగా మండిపడి, ఇవెలా లీకయ్యాయో ప్రశ్నించింది. ముందస్తు బెయిల్‌ను తిప్పికొట్టి, ఇద్దరూ రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. రికార్డుల లీకేజీపై ఉన్నతాధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

Similar News

News March 30, 2026

రాష్ట్రంలో హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్: కోమటిరెడ్డి

image

రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గేమ్ ఛేంజర్‌గా మారనున్న ట్రిపుల్ ఆర్, బందరు పోర్టు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. చెన్నై, పూణే, బెంగళూరులను కలుపుతూ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇందుకోసం శంషాబాద్ సమీపంలోని ఫ్యూచర్ సిటీలో ఏకంగా 500 ఎకరాలను ప్రభుత్వం కేటాయించనున్నట్లు ఆయన సభలో వెల్లడించారు.

News March 30, 2026

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్’

image

దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మంత్రి కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది రాష్ట్రంలో 22,441 ప్రమాదాలు జరిగి 6,221 మంది మృతి చెందడం విచారకరమన్నారు. ప్రాణాలు కాపాడే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రోడ్ల అభివృద్ధి కేవలం మౌలిక వసతుల నిర్మాణం మాత్రమే కాదని, ప్రజల ప్రాణాలను కాపాడే కీలక బాధ్యత అని ఆయన సభలో ఉద్ఘాటించారు.

News March 30, 2026

ఆర్థిక ప్రగతికి పునాది రోడ్లే: మంత్రి కోమటిరెడ్డి

image

రాష్ట్రంలో మెరుగైన రోడ్లు ఉంటేనే భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధితో రైతులు, విద్యార్థులు, రోగులకు అత్యంత మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో రోడ్ల కోసం ప్రత్యేకంగా హెచ్ఏఎం విధానాన్ని అమలు చేస్తున్నామని, ఫేజ్-1లో భాగంగా రూ.13,006 కోట్ల వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించనున్నట్లు సభలో ఆయన తెలిపారు.