News December 1, 2025
HYD: ఓన్లీ ప్రాఫిట్ నో లాస్ పేరుతో రూ.1.87కోట్ల మోసం

స్టాక్ సలహాల పేరుతో నగరానికి చెందిన కృత్రిమ ఆభరణాల వ్యాపారిని మోసగించిన ఇండోర్‌కు చెందిన ముఖేశ్ పాఠక్‌పై సీసీఎస్ కేసు నమోదు చేసింది. ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ అని నమ్మబలికి 2021 నుంచి 2024 వరకు దశలవారీగా రూ.1.87కోట్లు తీసుకున్న నిందితుడు. చివరికి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీసీఎస్ తెలిపింది.
Similar News
News March 24, 2026
క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: కలెక్టర్

జిల్లాను టీబీ రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో 21 పంచాయతీలను టీబీ ముక్తి జీపీలుగా గుర్తించామన్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, లక్ష్య సాధనలో ముందున్న పీహెచ్‌సీలకు రూ. లక్ష చొప్పున ప్రోత్సాహకాలు ప్రకటించారు.
News March 24, 2026
అనకాపల్లి: రాగల 5 రోజుల్లో తేలిక పాటి వర్షాలు

రాగల 5 రోజులలో అనకాపల్లి జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా.సీహెచ్ ముకుందరావు తెలిపారు. మంగళవారం అనకాపల్లిలోని పరిశోధనా కేంద్రంలో ఆయన వాతావరణ వివరాలను వెల్లడించారు. 5రోజులు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33.9 నుంచి 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 23.0 నుంచి 23.9 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని తెలిపారు.
News March 24, 2026
ప.గో కలెక్టర్ కీలక ఆదేశాలు

జిల్లాలో జల జీవన్ మిషన్ పనుల పురోగతిపై కలెక్టరేట్‌లో కలెక్టర్ చదలవాడ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పైపులైన్ల నిర్మాణ సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని, లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.


