News April 18, 2024

లింగంపేట్: మురికి కాలువలో పసికందు మృతదేహం

image

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామంలో మురికి కాలువలో పసికందు మృతదేహం కలకలం రేపింది. ఇవాళ ఉదయం గ్రామస్థులు పసికందు మృతదేహన్ని మురికి కాలువలో గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 11, 2025

NZB: కుళ్ళిన మృతదేహం లభ్యం

image

వర్ని మండలం అఫంధి ఫారం డంపింగ్ యార్డ్ పరిధిలో చందూర్ వైపు వెళ్తుండగా నిజామాబాద్ వర్ని ప్రధాన రోడ్డుకు ఎడమ వైపున కొద్ది దూరంలో అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని  మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉంది. గత 20 నుంచి 25 రోజుల కిందట మరణించి ఉంటాడని అఫంది ఫారం గ్రామానికి చెందిన రఘు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.

News January 11, 2025

రాజంపేట్: అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

image

రాజంపేట్ మండలం అర్గోండలో అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజశేఖర్(27) గతంలో జీవనోపాధి కోసం అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతూ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు.

News January 11, 2025

చింతకుంట అటవీ ప్రాంతంలో ఆవు పై చిరుత పంజా

image

మోస్రా మండలం చింతకుంట అటవీ ప్రాంతంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గజ్జి నారాయణ ఆవులు మేత మేయడానికి వెళ్లగా చిరుత ఆవుపై దాడి చేసింది. పెంపుడు కుక్కలు అరవడంతో ప్రాణాలతో బయట పడ్డట్టు బాధితుడు తెలిపారు. అటవీ ప్రాంతంలో చిరుతలు ఉన్నట్టు గతంలో గుర్తించినట్లు అటవీ శాఖ బీట్ ఆఫీసర్ హుస్సేన్ తెలిపారు. కాపరులు గుట్ట పైకి వెళ్ల కూడదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.