News December 1, 2025

GNT: ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా.!

image

ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు నేడు రాజీనామా చేయటం సంచలనంగా మారింది. వారు కొద్దిసేపటి క్రితం శాసనమండలి ఛైర్మన్‌ను కలిసి తమ రాజీనామాలు సమర్పించారు. రాజీనామా నేపథ్యంలో వివరణ ఇచ్చిన ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ, జాకియా ఖానం, పోతుల సునీతలు తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.

Similar News

News April 2, 2026

కొత్త కలెక్టర్ హరిందర ప్రసాద్‌కు శుభాకాంక్షల వెల్లువ

image

కాకినాడ కలెక్టర్ హరిందర ప్రసాద్‌ను SP బిందు మాధవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయనను ఎమ్మెల్యేలు నానాజీ, వరుపుల సత్యప్రభ, రెడ్ క్రాస్ ఛైర్మన్ వై.డి.రామారావు, జడ్పీ సీఈవో లక్ష్మణరావు కలిసి అభినందనలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.

News April 2, 2026

ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు యూరియా

image

చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే ర్యాక్ పాయింట్‌కు గురువారం యూరియా చేరినట్లు ఖమ్మం DAO ధనసరి పుల్లయ్య తెలిపారు. మొత్తం 2676 మెట్రిక్ టన్నుల యూరియాలో ఖమ్మంకు 1,176, భద్రాద్రికి 800, మహబూబాబాద్‌కు 500, సీఆర్పీకి 200 మెట్రిక్ టన్నులు కేటాయించారు. రైల్వే వ్యాగన్ల ద్వారా వచ్చిన యూరియాను లారీలు, ట్రాక్టర్లతో సహకార సంఘాలు, ప్రైవేటు దుకాణాలకు తరలించారు. పంపిణీని టీఏ పవన్ పర్యవేక్షిస్తున్నారు.

News April 2, 2026

పంత్ ఓపెనర్‌గానే రావాలి: అశ్విన్

image

LSG కెప్టెన్ పంత్ బ్యాటింగ్ పొజిషన్‌పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా విఫలమైనప్పటికీ పంత్ ఆ స్థానాన్ని వదలొద్దని సూచించారు. పవర్ ప్లే తర్వాత వస్తే బౌలర్లు ఈజీగా కట్టడి చేస్తారని, అందుకే 14 మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌గానే రావాలని కోరారు. కోచ్ లాంగర్, LSG మేనేజ్‌మెంట్‌లో ఎవరైనా ఈ విషయంపై పంత్‌కు నచ్చజెప్పి స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాలని సూచించారు.