News December 1, 2025

MDK: కొత్త వైన్ షాపులకు ఎలక్షన్ ‘కిక్కు’

image

2025-27 సంవత్సరానికి లక్కీడిప్‌ ద్వారా మద్యం షాపులు దక్కించుకున్న వారు ఈరోజు ఓపెన్ చేశారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ఉండడంతో షాప్‌లు దక్కించుకున్న వారికి ప్రారంభంలోనే లాభాల కిక్కు కలిసిరానున్నది. ఉమ్మడి జిల్లాలో మెజార్టీ వైన్స్‌లు లిక్కర్‌ సిండికేట్ల చేతికి చేరాయి. ఎన్నికలు కలిసి రావడంతో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు జోష్‌లో ఉన్నారు. సంగారెడ్డిలో 101, మెదక్ 43, సిద్దిపేటలో 93 షాపులున్నాయి.

Similar News

News March 20, 2026

శ్రీకాకుళం జిల్లాలో యువకుడి హత్య.!

image

శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న మోహన్ అనే వ్యక్తి గత రాత్రి హత్యకు గురయ్యారు. హత్య చేసిన వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలో మోహన్ తండ్రి ఇదే పార్టీ కార్యాలయంలో పనిచేసేవారు. అతని స్థానంలో మోహన్‌ను ఇటీవల నియమించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 20, 2026

మూసీ ‘మెగా’ ప్లాన్.. నిధులన్నీ భూసేకరణకే!

image

మూసీ ప్రక్షాళన కోసం బడ్జెట్‌లో రూ.7,000 కోట్లు కేటాయిస్తున్నట్లు సర్కారు ప్రకటించనుంది. సింహభాగం నిధులు నది శుద్ధి కోసం కాకుండా నిర్వాసితుల పరిహారం కోసమే ఖర్చు చేయబోతున్నారు. సుమారు 1,435 అక్రమ కట్టడాలను తొలగించేందుకు హైడ్రాకు ప్రత్యేకంగా రూ.200 కోట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. బడ్జెట్ అంకెల్లో మూసీ పేరు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో నిర్వాసితుల గొంతుక వినిపించకుండా జాగ్రత్త పడుతోంది సర్కారు!

News March 20, 2026

జనగామ జిల్లాలో మూడు కేజీబీవీలకు కొత్త గుర్తింపు

image

విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు ఉన్నత వృత్తి విద్యలో రాణించేలా ప్రభుత్వం ప్రతి జిల్లాలో మూడు కేజీబీవీలను ‘యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్’ (వైఐఐఓఈ)కు ఎంపిక చేసింది. ఇందులో భాగంగా జనగామ జిల్లాలోని చౌడారం, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్ కేజీబీవీలు ఎంపికయ్యాయి. ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతికత, వృత్తి నైపుణ్యాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.