News December 1, 2025
వయస్సును వెనక్కి తిప్పే బొటాక్స్

వయసు మీద పడుతున్నా యవ్వనంగా కనిపించేలా చేయడానికి అనేక రకాల చికిత్సలున్నాయి. వాటిల్లో ఒకటే బొటాక్స్. ముఖంపై ముడతలను పోగొట్టడానికి ఇచ్చే ఒక న్యూరో టాక్సిన్ ప్రొటీన్ ఇది. దీనిని బ్యాక్టీరియం క్లోస్ట్రిడియం బొటులినమ్ అనే బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. దీనిని మన కండరాల్లోకి చొప్పిస్తే చర్మంపై గీతలు, ముడతలు తగ్గి మృదువుగా కనిపిస్తుంది. సంవత్సరానికి 2-3 మూడు ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుంది.
Similar News
News March 6, 2026
తెలంగాణకు కొత్త గవర్నర్

కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది. తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లాను అపాయింట్ చేసింది. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. ఇక TG గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. నాగాలాండ్ గవర్నర్‌గా నంద్ కిశోర్ యాదవ్, బిహార్ గవర్నర్‌గా సయ్యద్ హస్నేన్, బెంగాల్ గవర్నర్‌గా R.N. రవిని నియమించింది.
News March 6, 2026
ఇరాన్ సుప్రీంలీడర్‌ను నేనే ఎంపిక చేస్తా: ట్రంప్

ఇరాన్ సుప్రీంలీడర్ ఎన్నిక విషయంలో తాను ఇన్వాల్వ్ అవుతానని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఖమేనీ కొడుకు మొజ్తబా సుప్రీంలీడర్ అయ్యే అవకాశం ఉందని, దీన్ని అంగీకరించబోమని స్పష్టంచేశారు. శాంతి, సామరస్యాన్ని తీసుకొచ్చే వ్యక్తిని కోరుకుంటున్నామని తెలిపారు. ‘వాళ్లు టైమ్ వేస్ట్ చేస్తున్నారు. ఖమేనీ కొడుకు ప్రభావం చూపలేడు. వెనిజులాలో డెల్సీని ఎంపిక చేసినట్లే ఇక్కడా నేను నియామకంలో పాల్గొనాలి’ అని చెప్పారు.
News March 6, 2026
BREAKING: ఫైనల్లోకి భారత్

T20WCలో భారత్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 రన్స్ తేడాతో విజయం సాధించింది. 254 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లిష్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. బెథెల్ సెంచరీతో (48 బంతుల్లో 105) బెంబేలెత్తించినా చివర్లో వికెట్లు పడటంతో భారత్ విజయం సాధించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది.


