News December 1, 2025

ఒకే పోస్టులో ఇద్దరు TTD ఉద్యోగులు

image

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఇద్దరు సూపరింటెండెంట్లు ఉంటారు. ఇందులో ఓ పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉంది. ఇటీవల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డిప్యుటేషన్‌పై సురేష్ బాబుకు పోస్టింగ్ ఇచ్చారు. 2రోజులు క్రితం మునిచెంగల్ రాయులకు సూపరింటెండెంట్‌గా ఇవ్వడంతో ఇద్దరు ఏ పని చేయాలో తెలియలేదు. డిప్యూటీ ఈవో సెలవుపై ఉండడంతో ఈ సమస్య నెలకొంది. ఆయన సెలవుపై వచ్చాక ఎవరికి ఏ విధులు అనేది క్లారిటీ వస్తుంది.

Similar News

News March 12, 2026

సంగారెడ్డి: 730 మంది విద్యార్థులు గైర్హాజరు

image

సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 18,911 మంది విద్యార్థులకు గాను 18,181 మంది (96.14%) హాజరయ్యారని, 730 మంది ఆబ్సెంట్ అయ్యారని జిల్లా విద్యాధికారి గోవింద్ రామ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాశారని ఆయన పేర్కొన్నారు.

News March 12, 2026

అల్లూరి జిల్లాలో 4 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు

image

ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలకు ఉమ్మడి అల్లూరి జిల్లాలో 4 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 8 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ గురువారం తెలిపారు. జిల్లాలో 72 సెంటర్స్‌కు సంబంధించిన సెట్ 1,2 ప్రశ్నపత్రాలు పోలిస్స్టేషన్‌లో భద్రపరిచామన్నారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా నిరంతరాయంగా తనిఖీలు ఉంటాయన్నారు. 11,457మంది పరీక్షలు రాస్తారన్నారు.

News March 12, 2026

మెదక్: ఇంటర్ పరీక్షలకు 96.71 % హాజరు

image

మెదక్ జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 6085 మందికి గాను 5895 మంది, ఒకేషనల్ విభాగంలో 279 మందికి గాను 260 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 96.71% హాజరు నమోదైంది. నేటితో మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.