News December 1, 2025
POK భారత్‌లో అంతర్భాగమే: JK హైకోర్టు

పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) భారత్‌లో అంతర్భాగమేనని, అక్కడ జరిగే వ్యాపారాన్ని ఇన్‌ట్రా స్టేట్ ట్రేడింగ్‌గా పరిగణించాలని జమ్మూ కశ్మీర్ హైకోర్టు చెప్పింది. GST అమలులోకి వచ్చినప్పటి నుంచి 2019లో POKలో వ్యాపారాన్ని నిలిపేసే వరకు జరిగిన ఎగుమతులు, దిగుమతులకు ట్యాక్స్ కట్టాలని అధికారులిచ్చిన నోటీసులపై వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. దీని విచారణలో భాగంగా హైకోర్టు ఈ కామెంట్లు చేసింది.
Similar News
News March 8, 2026
TODAY HEADLINES

* వంట గ్యాస్ ₹60, కమర్షియల్ గ్యాస్‌పై ₹115 పెంపు
* రాష్ట్రపతి WB పర్యటనలో ప్రొటోకాల్ వివాదం.. PM ఫైర్
* AP: క్వాంటం వ్యాలీతో అనేక మార్పులు: CBN
* AP: లస్కర్ల జీతం రూ.6వేలు పెంపు
* AP: ఇథిలీన్ గ్లైకాల్ కలవడంతోనే పాల కల్తీ
* TG: గద్దర్ అవార్డులు: ఉత్తమ నటి- రష్మిక
* TG: ఒకేసారి 130 మంది మావోల లొంగుబాటు
* TG: ఈనెల 31లోగా లక్ష గృహ ప్రవేశాలు: పొంగులేటి
News March 8, 2026
అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్

AP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ ఆమెను ఇటీవల ఈ కేసులో ఏ2గా చేర్చింది. ఈ మేరకు రాజమండ్రి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా విచారణ చేపట్టింది. తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.
News March 8, 2026
రాష్ట్రపతి ఘటన: మమత సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్

బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రపతి <<19322594>>ద్రౌపదీ ముర్ము<<>> పట్ల వ్యవహరించిన తీరు దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సంతాళీ తెగ సమ్మేళనాన్ని ఉద్దేశపూర్వకంగానే ఆ జనాభా తక్కువ ఉన్న చోట నిర్వహించడం, కనీస ప్రొటోకాల్ పాటించకుండా CM మమతా బెనర్జీ గైర్హాజరు కావడం గిరిజన జాతులను అవమానించడమేనని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారిని రాజకీయాల్లోకి లాగడం ఏమాత్రం సరికాదని ధ్వజమెత్తారు.


