News December 1, 2025
చొప్పరివారిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం

నల్గొండ జిల్లా చండూరు మండలం చొప్పరివారిగూడెం సర్పంచ్‌గా జాల వెంకన్నను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనకు కల్పించిన గౌరవానికి ఆయన సంతోషించి, గ్రామ అభివృద్ధికి తన వంతుగా రూ.18.16 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయాన్ని కొనసాగించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను అభినందించారు.
Similar News
News March 14, 2026
నెల్లూరు: కిరోసిన్ అయినా ఇవ్వండి సార్..!

నెల్లూరు జిల్లాలో ఇండియన్ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుకింగ్ సర్వర్ పనిచేయకపోవడంతో చాలా మంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ లేక ఇళ్లలో అవస్థలు పడుతున్నామని.. సమస్య పరిష్కారమయ్యే వరకు తాత్కాలికంగా కిరోసిన్ సరఫరా చేయాలని ప్రజలు జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు.
News March 14, 2026
జడ్చర్ల: రేపటి నుంచే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్లాసులు

జడ్చర్లలోని డా.బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్టడీ సెంటర్‌లో ఆదివారం నుంచి కౌన్సిలింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. డిగ్రీ 1, 2, 3వ సంవత్సరాల విద్యార్థులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు తరగతులకు హాజరు కావాలని ప్రిన్సిపల్ సుకన్య, కోఆర్డినేటర్ సదాశివయ్య కోరారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 14, 2026
కల్తీపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్: మంత్రి

AP: పాలు, నెయ్యి, వెన్నలో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాల వంటి ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కల్తీ పాలు కిడ్నీలు, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని.. కొనేటప్పుడు FSSAI లోగో, లైసెన్స్ నంబర్ సరిచూసుకోవాలని సూచించారు. ఏదైనా ఫిర్యాదు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1100, 1800 425 3857కు కాల్ చేయాలన్నారు. కల్తీపై అవగాహన పెంచుకోవడం ముఖ్యమని ట్వీట్ చేశారు.


