News December 1, 2025

కౌన్సిల్ సమావేశంలో అందెశ్రీకి నివాళి

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాలులో నిర్వహించిన సమావేశంలో ప్రముఖ కవి, రచయిత అందెశ్రీకి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేలు, మేయర్, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణ సాహిత్యానికి ఆయన మరణం తీరని లోటు అని నేతలు పేర్కొన్నారు.

Similar News

News March 20, 2026

జగిత్యాల : ఇంటర్మీడియట్ 3వ విడత మూల్యాంకనం ప్రారంభం

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని SKNR జూనియర్ కళాశాలలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్ మూడో విడత మూల్యాంకనం ప్రారంభమవుతున్నట్లు క్యాంప్ ఆఫీసర్ నారాయణ తెలిపారు. వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, వాణిజ్యశాస్త్రం, చరిత్ర సబ్జెక్టులలో మూల్యాంకనం ఉంటుందన్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు. మూల్యాంకన విధులలో ఎవరికి మినహాయింపు లేదని పేర్కొన్నారు.

News March 19, 2026

‘ధర్మపురి బస్సు డిపో మంజూరుకు కృషి చేస్తా’

image

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రితో మాట్లాడి ధర్మపురిలో బస్ డిపో మంజూరు కోసం కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. వచ్చే గోదావరి పుష్కరాల వరకు ధర్మపురిలో బస్ డిపో నిర్మాణం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. గురువారం ధర్మపురిలోని ఎస్‌హెచ్ గార్డెన్‌లో ముస్లిం సోదరులకు తోఫా పంపిణీ కార్యక్రమంలో మంత్రి పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.

News March 19, 2026

IPL-2026: స్టార్ బౌలర్లు దూరం!

image

IPL-2026కు మరో ఇద్దరు విదేశీ బౌలర్లు దూరం కానున్నారు. రాజస్థాన్ తరఫున ఆడనున్న సామ్ కరన్ (ఇంగ్లండ్) గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం అయ్యారని క్రీడావర్గాలు వెల్లడించాయి. అటు పంజాబ్ కింగ్స్ బౌలర్ ఫెర్గూసన్ (న్యూజిలాండ్) ఇటీవల తండ్రి అయ్యారు. బిడ్డతో గడిపేందుకు స్వదేశానికి వెళ్లనుండటంతో ఆరంభంలోని కొన్ని మ్యాచులకు దూరం కానున్నారు. ఇప్పటికే కమిన్స్, హేజిల్‌వుడ్ కొన్ని మ్యాచులు ఆడట్లేదు.